
Summer Trip: వేసవి వచ్చింది.. హాలిడేస్ స్ట్రాట్అయ్యాయి.. మరీ ఈ ఎండాకాలంలో ఏం చేద్దాం.. అని చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు చర్చించుకోవడం ప్రారంభించారు. కొందరు పిల్లలు తమ సొంత ఊళ్లోకి పయనం కాగా.. మరికొందరు ప్రత్యేక శిక్షణలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు ఇంటి వద్దే ఇతరులతో ఆటపాటల్లో మునిగారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు వేసవి ట్రిప్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ వేసుకుంటారు. కానీ వారికి సమయం, ఉద్యోగాల బిజీ కారణంగా వారు అనుకున్న ప్రదేశానికి వెళ్లలేకపోతారు. కానీ హైదరాబాద్ కు తక్కువ దూరంలో విహారయాత్రకు వెళ్లే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. వారి కోసం ఆ వివరాలు మీ ముందు ఉంచుతున్నాం.
శ్రీరాంసాగర్:
నిజామాబాద్ జిల్లాలో నీటి ప్రాజెక్టు ఇది. హైదరాబాద్ కు 207 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో లేదా, నిజామాబాద్ కు బస్సులో వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లచ్చు. అక్కడి వెళ్లిన వారు నిర్మల్ కొయ్య బొమ్మల చూడ్డానికి వెళ్లొచ్చు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది.
లక్నవరం:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం వెళ్లే దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల ప్రయాణం. లేక్ క్రాసింగ్, రోప్ కోర్సులు, కయాకింగ్, వంటికి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దీనికి సమీపంలో బొగత జలపాతం వరకు వెళ్లి ఆనందించొచ్చు.

డిండి ప్రాజెక్టు:
హైదరాబాద్ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సందర్శకుల బాగా వస్తారు. ఇక్కడ ట్రెక్కింగ్, బ్యాక్ వాటర్ ట్రిప్స్ తో సంతోషంగా గడపొచ్చు. శ్రీశైలం వెళ్లాలనుకునేవారు సైతం డిండిని చూడొచ్చు. ఇక్కడి నీటి అందాలు కనువిందు చేస్తాయి.

అనంతగిరి సరస్సు:
చుట్టూ కొండల మధ్య సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ పద్మనాభస్వామి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ కోరుకునేవారు అనంతగిరికి వస్తుంటారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న ఇక్కడికి వెళ్లాలంటే 2.19 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి 82.2 కిలోమీటర్ల డిస్టెన్స్.

కీసర:
పచ్చని అడవిలో పక్షుల కిలకిల రాగాల మధ్య విహరించాలుకునేవారు వెంటనే కీసరకు వెళ్లొచ్చు. కొండల పైకి ఎక్కి వ్యూ పాయింట్ కనిపించే విధంగా ఉండే ప్రదేశాలు అందాన్నిస్తాయి. ఇక్కడున్న శివాలయం ఆధ్మాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్ కు అతి సమీపంలో కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఈ అడవిని సందర్శించవచ్చు. ఇక్కడి వెళ్లడానికి 1 గంట పడుతుంది.