
Sai Dharam Tej Love Story: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంత సరదాగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటాడు. అలాంటి ఆయనకీ బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసారు. చివరికి ఆయన సురక్షితంగా ప్రాణకాలతో బయటపడి, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. రేపు ఆయన హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం విడుదల అవ్వబోతుంది.
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో హానర్ జానర్ మీద తెరకెక్కిన ఈ థ్రిల్లర్ కోసం అటు మెగా అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రేక్షకులకు మరింత చేరువ చెయ్యడం కోసం సాయి ధరమ్ తేజ్ ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఫన్నీ మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

ముఖయంగా సాయి ధరమ్ తేజ్ పలానా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు, ప్రేమలో ఉన్నదంటూ సోషల్ మీడియా లో వందల కొద్దీ కథనాలు వచ్చాయి. వీటి గురించి యాంకర్ అడగగా సాయి ధరమ్ తేజ్ దానికి సమాధానం చెప్తూ ‘ప్రతీ అబ్బాయి జీవితం లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దాని నుండి మనం తప్పించుకోలేము. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది.కట్ చేస్తే డిగ్రీ లో నేనే ఆమెకి దగ్గరుండి పెళ్లి చేశాను.ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తిక్క హీరోయిన్ లారిస్సా బోనేసి ని ప్రేమించాను. ఒక రోజు ఆమె దగ్గరకి వెళ్లి నువ్వు నాకు చాలా బాగా నచ్చావ్, కలిసి డేటింగ్ చేద్దామా అని ప్రపోజ్ చేశాను.కానీ ఆమె నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి నా హార్ట్ ని బ్రేక్ చేసింది .అప్పటి నుండి ప్రేమ జోలికి పోలేదు’ అంటూ సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.