Heroes Romance : రొమాన్స్ చేసేటప్పుడు హీరోల మనస్సులో అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి…!

Heroes Romance : హీరోల అదృష్టానికి సాధారణ జనాలు కుళ్ళు కుంటారు. ఒక అందమైన హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేసిన హీరోని చూసి… పెదాలు జుర్రేశాడు, లక్కీ ఫెలో అంటాము. హీరో అయితే ఎంత మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యొచ్చో అని ఊహల్లో తేలుతాము. సిల్వర్ స్క్రీన్ పై హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. హీరో హీరోయిన్ మేమేకమై రొమాన్స్ చేస్తుంటే, సీట్లో కూర్చున్న ప్రేక్షకుల నరాలు […]

Written By: NARESH, Updated On : December 30, 2022 6:16 pm
Follow us on

Heroes Romance : హీరోల అదృష్టానికి సాధారణ జనాలు కుళ్ళు కుంటారు. ఒక అందమైన హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేసిన హీరోని చూసి… పెదాలు జుర్రేశాడు, లక్కీ ఫెలో అంటాము. హీరో అయితే ఎంత మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యొచ్చో అని ఊహల్లో తేలుతాము. సిల్వర్ స్క్రీన్ పై హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. హీరో హీరోయిన్ మేమేకమై రొమాన్స్ చేస్తుంటే, సీట్లో కూర్చున్న ప్రేక్షకుల నరాలు జివ్వు మంటాయి. కానీ రొమాంటిక్ సీన్స్ ని నటులు ఎంజాయ్ చేయరు. ఎందుకంటే నాలుగు గోడల మధ్య చేయాల్సిన ప్రైవేట్ వ్యవహారం… యూనిట్ ముందు, దర్శకుడు కోరుకున్నట్లు చేయడం చాలా ఇబ్బంది పెట్టే అంశం.

 

ముఖ్యంగా హీరోలు ఆందోళనకు గురవుతారు. సీన్ పండాలి అంటే హీరో హీరోయిన్ ఫీలై, ఇన్వాల్వై చేయాలి. కొంచెం స్వేచ్ఛ తీసుకొని చేస్తే… హీరోయిన్ తప్పుగా అనుకుంటుందేమో అనే భయం ఉంటుంది. ఈ షాట్ త్వరగా అయిపోతే బాగుండని హీరోలు మనసులో అనుకుంటారు. దాదాపు 19 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న తమన్నా.. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోలు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పింది. ఆమె అభిప్రాయంలో హీరోలు రొమాంటిక్ సీన్స్ అసలు ఇష్టపడరు.

సాధారణ జనాలు హీరోలు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటారు. కానీ అది నిజం కాదు. హీరోలు రొమాంటిక్ సీన్స్ ఇష్టపడరు. మొహమాటం ఉన్న హీరోలు, స్టార్ హీరోలు బాగా ఇబ్బంది పడతారు. ఆ సమయంలో హీరోయిన్ తో అసలు మాట్లాడరు. మౌనంగా ఉండిపోతారు. రొమాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ ఏమన్నా అనుకుంటుందేమో అని మనసులో సందేహపడతారు. హీరోలు అసౌకర్యంగా ఫీల్ అయ్యే సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు మాత్రమే… అని, అసలు విషయం చెప్పుకొచ్చారు.

హీరోయిన్ కి మించిన భయం, బెరుకు హీరోలలో ఉంటుంది. ఎంత సినిమా షూటింగ్ అయినప్పటికీ యూనిట్ సభ్యుల మధ్య రొమాన్స్ చేయడం, బోల్డ్ సన్నివేశాల్లో నటించడం హీరోలకు చెమటలు పట్టిస్తుంది. కాగా తమన్నా లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం ఇటీవల విడుదలైంది. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జంటగా భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు రోల్ చేయడం విశేషం.