Vijayasai Reddy : విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయారు.బయటపడే వీలు లేని వివాదంలో చిక్కుకున్నారు.లేటు వయసులో వివాహేతర సంబంధం అపవాదును ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు తనపై వచ్చిన వివాదాలు ఒక ఎత్తు..ఇప్పుడు వచ్చినది మరో ఎత్తు.మానసికంగా,కుటుంబ పరంగా ఆయన కృంగిపోతున్నారు. అవినీతి కేసుల్లో సిబిఐ అరెస్టు చేసిన సమయంలో కూడా పెద్దగా చలించలేదు.కానీ ఇప్పుడు తనపై మోపిన అభియోగం మాయని మచ్చగా నిలుస్తుంది. తనపై గౌరవాన్ని తగ్గిస్తోంది.అందుకే జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఇంతటి కష్టకాలంలో తనకు ఎవరూ అండగా నిలబడలేదన్న బాధ ఆయనలో కనిపిస్తోంది.దిగాలుగా కనిపిస్తున్నారు.తాను ఒంటరి అన్న భావనలో ఉన్నారు. పార్టీ కోసం ఇంతలా పనిచేస్తే కనీసం ఒక్కరు అండగా నిలవక పోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు.
విజయసాయిరెడ్డి వివాదంలో పార్టీ నుంచి స్పష్టమైన లైన్ వచ్చినట్లు తెలుస్తోంది.ఎవరూ పెద్దగా స్పందించ వద్దని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందుకే విజయసాయిరెడ్డితో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారు సైతం స్పందించడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా జగన్ కు ఇష్టం లేకపోవడంతోనే ఎవరు నోరు తెరవడం లేదు. విజయసాయి రెడ్డికి సపోర్ట్ చేయవద్దని అంతర్గత ఆదేశాలను జగన్ ఇవ్వడంతో.. పార్టీలో నెంబర్ 2 గా భావించుకున్న విజయసాయిరెడ్డికి గట్టి షాక్ తగిలినట్లు అయింది.
జగన్ కు కష్టకాలంలో అండగా నిలిచారు విజయసాయి రెడ్డి. అక్రమాస్తుల కేసుల్లో ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి జగన్ తో పాటే జైలుకు వెళ్లారు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసిపికి పిల్లర్ గా ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు వడ్డారు విజయసాయిరెడ్డి. తెలంగాణ పోలీసులను వాడుకునే స్వేచ్ఛ కెసిఆర్ ఇవ్వడంతో.. ఓ రేంజ్ లో టిడిపి మూలాలను దెబ్బతీయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. టిడిపి విభేదించడంతో బిజెపికి వైసిపి దగ్గరయింది. ఈ ఎపిసోడ్ లో సైతం విజయసాయిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను కేంద్ర పెద్దల కాళ్లపై కూడా పడిపోయారని అప్పట్లో టాక్ వినిపించింది. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర. ప్రశాంత్ కిషోర్ టీం తో సమన్వయంతో పని చేశారు. ప్రతి నియోజకవర్గ పంపకాల బాధ్యతను అతనే తీసుకున్నారు. అందుకే గెలిచిన తరువాత జగన్ విజయసాయిరెడ్డి ని ఆలింగనం చేసుకున్నారు. విజయోత్సవాన్ని పంచుకున్నారు.అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అంతంత మాత్రమే.
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనులు చక్కబెట్టుకోవడంలో విజయసాయిరెడ్డి బిజీగా ఉండగా.. జగన్ పక్కన చేరారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటినుంచి విజయసాయిరెడ్డిని పలుచన చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విజయసాయి రెడ్డి వ్యవహారాలను ఇంటెలిజెన్స్ ను ప్రయోగించి సజ్జల తెలుసుకున్నారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే జగన్ విజయసాయి రెడ్డిని పక్కన పెట్టినట్లు టాక్ నడుస్తోంది. అందుకే సొంత పార్టీలోనే కుట్ర జరుగుతున్నట్లు విజయసాయి అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ ఉన్నతి కోసం తాను అంత కష్టపడితే.. ఇప్పుడు అదే జగన్ తనను పక్కన పెట్టడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ప్రత్యర్థులతో కలవడానికి వీలు లేకుండా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. అందుకే రెండిటికీ చెడ్డ రేవడిగా మారారు. కనీసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకుందామన్నా వీలు లేదు. చంద్రబాబుకు దగ్గరై వివాదాల నుంచి బయట పడదామనుకున్నా దారి లేకుండా పోయింది.