
AP BJP- Chandrababu: మహేష్ బాబుకు తొలి బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒక్కడు’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ కు మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ సినిమాలో ఒక దృశ్యం ఉంటుంది. హీరో మహేష్ బాబును పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి విలన్ ప్రకాష్ రాజ్ చంపాలని చూస్తాడు. ఓ ప్రదేశానికి తీసుకెళ్లి తన ఫ్యాక్షన్ సైన్యంతో చుట్టుముట్టి అంతమొందించాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే ఒక ట్టిస్ట్. ఫ్యాక్షనిస్టులు వెనుకలా నిల్చున్న వారు.. ముందున్న వారి మెడపై కత్తిపెడతారు. అప్పుడే మహేష్ బాబు ఒక డైలాగు చెబుతాడు. తెల్లదుస్తులు వేసుకున్నట వారంతా ఫ్యాక్షనిస్టులు కాదని.. వారంతా తమ వారేనని చెప్పి ప్రకాష్ రాజ్ కు బుద్ధి చెబుతాడు. ఇప్పడు చంద్రబాబు కూడా ఆ బాబు డైలాగే చెబుతున్నాడు. బీజేపీలో ఉన్నవారంతా.. బీజేపీ వారు కాదని.. అదంతా పసుపు దండు అని చెబుతున్నారు. ఒక్కొక్కర్నీ పిలిచి మరీ సైకిలెక్కిస్తున్నారు.
సంక్షోభాలను దాటి విజయాలను అందుకోవడంలో చంద్రబాబు ఆరితేరారు అంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటూ.. మామ ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి ఎంటరయ్యారు. లేటుగా వచ్చినా మొత్తం పార్టీని టేకోవర్ చేసుకోగలిగారు. లక్ష్మీపార్వతి అకాల ఆగమనంతో వచ్చే ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టారు. నందమూరి కుటుంబసభ్యులతోనే ఆమెకు చెక్ చెప్పగలిగారు. ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేసి పార్టీని హ్యాండోవర్ చేసుకున్నారు. వెన్నుపోటు పొడిచారన్న అపవాదును దాటుకొని 1999 ఎన్నికల్లో గెలుపొందగలిగారు. 2004,2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఆటుపోట్లను ఎదుర్కొని 2014 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చవిచూసి సంక్షోభం అంచున ఉన్నా.. మరోసారి పోరాట పటిమతో గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
అయితే ఈ పరిణామ క్రమంలో చంద్రబాబు అనుకూలురు ఆయన్ను ఒకలా అభిలాషిస్తారు. ప్రత్యర్థులు మాత్రం మరోలా అభివర్ణిస్తారు. అయితే ఆయన రెండుసార్ల గట్టెక్కింది మాత్రం పొత్తులతోనే. 1999లో బీజేపీతో, 2014లో బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకొని బయటపడ్డారు. కానీ అదే బీజేపీని అకారణంగా వదులుకున్నారు. పవర్ లో ఉన్నప్పుడు నిర్వీర్యం చేశారు. పేరుకే అది జాతీయ పార్టీ కానీ.. టీడీపీకి ఉప ప్రాంతీయ పార్టీగా మార్చేశారన్న వారే అధికం. అయితే ఈ విషయం బీజేపీ హైకమాండ్ లేటుగా గుర్తించినట్టుంది. వచ్చే ఎన్నికల్లో తమకు ఏపీ అవసరం లేదన్నట్టు భావిస్తోంది. చంద్రబాబుతో కలిస్తే పార్టీ మరో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుందని అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ట్రాప్ లో పడకూడదని భావిస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఈ విషయం తెలియడంతో చాలా తెలివిగా పావులు కదుపుతున్నారు. బీజేపీలో ఉన్నవారిని సైకిలెక్కించే వ్యూహానికి పదును పెడుతున్నారు. అందుకు ఎల్లో మీడియా సహకారం తీసుకుంటున్నారు.
ముందుగా బీజేపీ నాయకుల క్రెడిబులిటీపై దెబ్బతీసి హైకమాండ్ అనుమానంగా చూడాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం. కమలదళంలోని నాయకులు కొందరు తెలుగుదేశం లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు..’ అనే అబద్ధపు ప్రచారాలను తన పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. తద్వారా ఆయా నాయకులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ నాయకుల మీద పార్టీలో అనుమానం మొదలయ్యేలా చేస్తున్నారు. ఈ చంద్రవ్యూహంలో చిక్కుకొని వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నెమ్మది నెమ్మదిగా పార్టీ తమను అనుమానంగా చూస్తున్నందున, పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడమే బెటర్ అనుకునే పరిస్థితి ఏర్పడేలా చేయాలనేది చంద్రబాబు నాయుడు స్కెచ్.

ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. ఆయన విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే తనదగ్గర ఉన్న రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని లాక్కొని.. సోము వీర్రాజుకు అప్పగించిన నాటి నుంచే పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. వేరే ఆప్షన్ లేక ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయన చేరక ముందు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కన్నా లక్ష్మీనారాయణను ఇంటికి వెళ్లి కలిస్తే.. అక్కడికేదో ఆయన కూడా పార్టీ మారిపోతున్నట్లుగా ప్రచారం చేశారు. కడప జిల్లాలోని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారంటూ ఒక ప్రచారం మొదలైంది. అటు చంద్రబాబు నాయకత్వాన్ని ధ్వేషించే పురందేశ్వరిని సైతం టీడీపీలోకి వచ్చేలా చేయాలన్నది వ్యూహం. అందులో భాగంగా ఎన్టీఆర్ పై జీవీఎల్ అనుచిత వ్యాఖ్యలు అంటూ ఒక ప్రచారం చేశారు. అయితే ఎల్లో మీడియా ఏది చేసినా అది చంద్రబాబు కోసమే. కానీ ఈ వ్యూహంలో కేంద్రపెద్దలపై భక్తి చాటుకుంటూనే సోము వీర్రాజు, జీవీఎల్ ను కార్నర్ చేయాలన్నదే చంద్రబాబు అభిమతంగా తెలుస్తోంది.