
Sreemukhi Instagram Photos: శ్రీముఖి ఏం చేసినా ప్రత్యేకమే. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఆమె అందాల ఆరబోత ఎక్కువైంది. కురచ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ కునుకు లేకుండా చేస్తుంది. రోజురోజుకు బోల్డ్నెస్ లో బౌండరీలు చెరిపేస్తుంది. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. కారణం ఆమె గ్లామర్ ట్రీట్. గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడంలో తన సీనియర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లను శ్రీముఖి మించిపోయింది. వారు కూడా ఆశ్చర్యపోయేలా పరువాల ప్రదర్శన చేస్తుంది.

ఇక వాలెంటైన్స్ డే పురస్కరించుకొని శ్రీముఖి ఓ ఫోటో షూట్ చేశారు. రెడ్ ట్రెండీ వేర్ ధరించి మెస్మరైజ్ చేశారు. శ్రీముఖి టాప్ కొంచెం వెరైటీగా ఉంది. ఆ డిజైన్ చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ గాలి బొక్కల చొక్కా ఏమిటీ? రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ గుర్తుకు వస్తుందని కామెంట్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

కాగా శ్రీముఖి దశ తిరిగింది. ఆమె స్టార్ యాంకర్ హోదా పట్టేశారు. ఒకటి నాలుగు షోలు చేస్తున్నారు. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో ఫేమస్ షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మొదలైన బీబీ జోడీ షోలో దుమ్మురేపుతున్నారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కంటెస్టెంట్స్ డాన్స్ షోకి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తరుణ్ మాస్టర్, రాధ, సదా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.

శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పక్కన ఉన్న మా నాన్న ఫోటో బ్లర్ చేసి వరుడు అంటూ ప్రచారం చేస్తున్నారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా చెప్తాను. దయచేసి పుకార్లు లేపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు శ్రీముఖి హీరోయిన్ కావాలని చూస్తున్నారు. వెండితెరను కూడా దున్నేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఆల్రెడీ పలు చిత్రాల్లో శ్రీముఖి నటించారు. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ అయ్యారు. ఒకప్పటి యాంకర్ అనసూయ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యారు. అలానే శ్రీముఖి ఎదగాలని అనుకుంటున్నారు. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.