
Chetan Sharma Sting Operation: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగు చూసాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ విస్తు గొలిపే వాస్తవాలను కళ్ళ ముందు ఉంచారు.. ఇప్పటివరకు నాలుగు గోడల మధ్య పాతిపెట్టినట్టుగా ఉన్న రహస్యాలను ఒక్కసారిగా బట్టబయలు చేశారు.. టీమిండియాలో ఫేక్ ఫిట్నెస్, ఇంజక్షన్ల వినియోగం, గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం.. ఎన్నో విషయాల వెనుక అసలు ఉన్న లోగుట్టును చేతన్ శర్మ బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు.
వాస్తవానికి టీం ఇండియా కూర్పుపై గత కొంతకాలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఇటీవల జరిగిన మ్యాచుల్లో ముఖ్యంగా టి20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. జట్టు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.. ఆ సమయంలో వారి కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ బీసీసీఐ ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. నెటిజన్లు అయితే సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐ ని పారేశారు.. అయితే టీమిండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా, మీకు వచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అని? ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అని? అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి?, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు చేతన్ శర్మ బయట ప్రపంచానికి చెప్పేశారు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీసీసీఐ ని గజగజా వణికిస్తున్నాయి.
అప్పట్లో విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీకి అసలు పడకపోయేది.. ఒకానొక దశలో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది.. ఫలితంగా బీసీసీఐ బోర్డు వర్సెస్ కెప్టెన్ అన్నట్టుగా సాగింది.. ఈ వివాదం వెనుక ఉన్నది ఎవరో? ఎందుకోసం దీన్ని రగిలించారో చేతన్ శర్మ చెప్పేసాడు.. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు చీఫ్ సెలెక్టర్ ను ఎలాంటి కానుకలు ఇచ్చి లబ్ధి పొందారో కూడా వివరించాడు.. అప్పటివరకు గొప్ప గొప్ప ఆటగాళ్ళుగా పేరుపొందిన క్రికెటర్లు తర్వాత విశ్రాంతి పేరుతో క్రికెట్ కు ఎలా దూరమయ్యారు అనేది కూడా చేతన్ శర్మ వివరించాడు.

టీమిండియాలో అర్హత సంపాదించుకునేందుకు, ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు ఆటగాళ్లు ఏం చేస్తున్నారు? ఇదంతా బీసీసీఐకి తెలిసే జరుగుతోందా? ఒకవేళ తెలిసే జరిగితే టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఆ నేరాన్ని ఎందుకు ఆపలేకపోయారు?. ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎవరిపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిళ్ళు వస్తున్నాయి? అనేక సంచలన విషయాలను శర్మ స్టింగ్ ఆపరేషన్లో పంచుకున్నారు.
Also Read:Anushka Shetty Health: షాక్… అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి!