
Sreeleela: టాలీవుడ్ లో కన్నడ భామల హవా కొనసాగుతుంది. ఛలో మూవీతో అడుగుపెట్టిన రష్మిక మందాన అందరినీ దాటుకుంటూ టాప్ పొజిషన్ సొంతం చేసుకుంది. ఎంట్రీ ఇచ్చిన నాలుగైదేళ్లలోనే మహేష్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేసింది. రష్మిక జోరు కొనసాగుతుండగానే మరో బెంగుళూరు భామ రంగంలోకి దిగింది. యంగ్ బ్యూటీ కృతి శెట్టి వస్తువస్తూనే సంచలనాలు నమోదు చేసింది. ఆమె డెబ్యూ మూవీ ఉప్పెన రికార్డు బ్రేకింగ్ వసూళ్లు అందుకుంది. కృతి గ్లామర్ యువతను మంత్రముగ్ధులను చేసింది.
ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి… శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలతో హట్రిక్ పూర్తి చేసింది. అరుదైన రికార్డు తన సొంతం చేసుకుంది. వీరిద్దరినీ మించిన జోరు చూపిస్తుంది శ్రీలీల. బెంగుళూరులో పుట్టిపెరిగిన శ్రీలీల కోసం టాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. హిట్ పడకముందే ఆమె ఫేమ్ ఎక్కడికో వెళ్ళింది. ధమాకా విజయం సాధించాక ఆమెను ఆపడం ఎవరి తరం కావడం లేదు.
పెళ్లి సందD మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీలీల దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్నారు. ఆ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా… శ్రీలీల గ్లామర్, యాక్టింగ్, డాన్స్ లకు మంచి పేరొచ్చింది. దీంతో ధమాకా మూవీలో రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. శ్రీలీల లక్కేమో తెలియదు కానీ నెగిటివ్ టాక్ తో ధమాకా హిట్ కొట్టింది. అది ఆమెకు ప్లస్ అయ్యింది. అధికారికంగా శ్రీలీల ఖాతాలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

త్రివిక్రమ్-మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి మూవీతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయట. తనకంటే ముందు వచ్చిన రష్మిక, కృతి శెట్టిలకు షాక్ ఇస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా…