
India Vs Australia 1st Test 2023: గవాస్కర్, బోర్డర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే 144 పరుగుల ఆధిక్యం లో ఉంది. జడేజా, అక్షర్ క్రీజులో ఉన్నారు. ఇప్పటికి 7 వికెట్లు నేల కులాయి..చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జడేజా, అక్షర్ ఇప్పటి వరకూ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడు ఇలాగే జోరు కొనసాగిస్తే భారత్ మరింత మెరుగైన స్కోర్ సాధిస్తుంది.. ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫే తప్ప ఎవరూ రాణించడం లేదు. విరగ తీస్తాడు అనుకున్న లియోన్ ఒక వికెట్ తోనే సరి పెట్టుకున్నాడు. ప్యాట్ కమ్మిన్స్ కూడా ఒక వికెట్ మాత్రమే తీశాడు.
విదర్భ స్టేడియం ఇప్పటికే పొడి బారింది. పిచ్ పై తేమ శాతం లేకపోవడంతో బౌలర్లకు వికెట్లు తీయడం అంత సులభం కావడం లేదు. బంతులు టర్న్ తీసుకోకపోవడం తో బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నారు. రెండో రోజు ఆటలో ఇదే జరిగింది. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ లలో ముర్ఫే తప్ప ఎవరూ ఆకట్టుకోవడం లేదు. భారత్ మైదానాల్లో ఆడిన అనుభవం ఉన్న లయాన్ కూడా తేలి పోతున్నాడు. కొత్త కుర్రాడు ముర్ఫే మాత్రం ఆకట్టుకుంటున్నాడు.. నిర్జీవంగా మారిన మైదానంపై వైవిధ్య కరమైన బంతులు వేస్తూ వికెట్లు రాబడుతున్నాడు.. ఇప్పటివరకు అతడు ఐదు వికెట్లు తీశాడు. ఇక మూడో రోజు ఆటలో కూడా అతడు ఇదే స్థాయి ప్రదర్శన చేస్తే భారత్ త్వరగా ఆల్ అవుట్ అవ్వడం ఖాయం.. అయితే వీలైనంత వేగంగా పరుగులు రాబట్టి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాలని టీం ఇండియా ఆలోచనగా ఉంది.

ఇక ఇండియా బౌలర్ లలో రవీంద్ర జడేజా వైవిద్యమైన బంతులు వేస్తున్నాడు.. తొలిరోజు ఆస్ట్రేలియా జట్టును ఆల్ అవుట్ చేయడంలో అతడు కీలకపాత్ర పోషించాడు.. తన పునరాగమనాన్ని ఐదు వికెట్లు తీసి ఘనంగా చాటాడు.. జడేజాకు అశ్విన్ కూడా తోడు కావడంతో భారత్ స్పిన్ దళం బలంగా ఉంది. ఇదే సమయంలో అక్షర పటేల్ తేలిపోతుండడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.. పైగా ఫాస్ట్ బౌలర్లు కూడా ఒక వికెట్ తోనే సరిపెట్టుకోవడం రోహిత్ సేనను కంగారు పెట్టిస్తోంది.. ఒకవేళ టీమిండియా ఈరోజు త్వరగా నే ఆల్ అవుట్ అయితే స్పిన్నర్ల పైనే భారం పడుతుంది. నిర్జీవంగా మారిన మైదానంపై వికెట్లు తీయాలంటే వారు బాగా కష్టపడాల్సి ఉంటుంది.. అయితే తొలి రోజు భారత స్పిన్నర్లకు సరెండర్ అయిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్… ఎలా కాచుకుంటారనే దాని పైనే ఆస్ట్రేలియా భవితవ్యం ఆధారపడి ఉంది.