
Mobile Side Effects: ఈ రోజుల్లో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. చేతి వేళ్లతోనే పనులు చేస్తుండటంతో కళ్లకు కూడా ఎఫెక్ట్ పడుతోంది. రోజంతా ఎక్కువ సేపు సెల్, కంప్యూటర్ స్క్రీన్లను తదేకంగా చూస్తుండటంతో రెప్ప వాల్చే సమయం కూడా ఉండటం లేదు. దీంతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఏడాది పాటు రాత్రుళ్లు సెల్ అదే పనిగా చూస్తుండటంతో ఆమెకు కంటి సమస్యలు వచ్చాయి. ఈ విషయాన్ని డాక్టరే ట్విట్టర్ లో పోస్టు చేయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. మొబైల్, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల వాడకం అంత మంచిది కాదని తెలిసినా ఈ రోజుల్లో వేరే పనులు అందుబాటులో లేకపోవడంతో ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఎక్కువ సేపు..
మొబైల్ కానీ కంప్యూటర్ అయినా ఎక్కువ సేపు అదేపనిగా చూస్తుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. ఇందులో కంటి జబ్బులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. స్క్రీన్లను పదేపదే చూడాల్సి వస్తుంది. అందుకే నరాలపై కూడా ప్రభావం పడుతుంది. కండరాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రస్తుతం జనాభాలో కంప్యూటర్లతో పనిచేసే వారే ఎక్కువ. ఎవరైనా సాఫ్ట్ వేర్ జాబులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటితో పనిచేయాల్సి రావడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఏం చర్యలు తీసుకోవాలి?
కంప్యూటర్ తో ఉద్యోగాలు చేసే వారు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చర్యలకు ఉపక్రమించాలి? అనే విషయాలను తెలుసుకుని మసలుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే ఉద్దేశంతో కంప్యూటర్ల ముందు ఉండి పనులు చేసుకునే వారు ప్రతి ఇరవై నిమిషాలకు ఓ సారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకు దృష్టి లోపం రాకుండా ఉంటుంది.

ఇలా చేయడం వల్ల..
ప్రతి 15-20 నిమిషాలకోసారి ఇలా చేయడం వల్ల కనుగుడ్డుపై కన్నీరు వ్యాప్తి చెంది కన్ను హైడ్రేటెడ్ గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ జాబులు చేసే వారు అదే పనిగా కంప్యూటర్ల ముందు కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి కాస్త అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే కూడా మంచిదే. కానీ కొందరు పనిలో పడితే ఏం చూసుకోరు. సమయాన్ని పట్టించుకోరు. పని కావాలనే ఆతృతలో ఇలా చేస్తే మన కళ్లకు, నరాలు, కండరాలకు సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకుని రోగాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.