Viral tweet : లక్షన్నర జీతం.. ఏం మిగలడం లేదట.. ఈయన ఖర్చులు చూస్తే..

సౌరవ్ దత్త.. ఉత్తర భారతదేశానికి చెందిన ఇతడు ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. నెలకు 1.50 లక్షలు వేతనంగా వస్తుంది. ఆరు లక్షలు అదనపు భత్యాల కింద లభిస్తాయి. మొత్తంగా అతడికి 25 లక్షలు వస్తాయి. అతడికి భార్య, ఒక కుమారుడు సంతానం. మీరు ముగ్గురు కమ్యూనిటీలో నివాస ఉంటున్నారు.. ఇతడికి వచ్చే 1,50,000 వేతనంలో EMI కి లక్ష వరకు వెళ్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 13, 2024 10:32 am

salory and Expenditure

Follow us on

Viral tweet : ఒకప్పటితో పోల్చితే మనుషుల ఆదాయాలు పెరిగాయి. ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో చాలామందికి వచ్చే ఆదాయానికి, అవుతున్న ఖర్చుకు లంకె కుదరడం లేదు. దీంతో నగదు సర్దుబాటు చేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇందులో మామూలు వేతన జీవి నుంచి మొదలు పెడితే.. భారీగా జీతభత్యాలు అందుకునే వారి వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అయితే తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఒక్కొక్కరు ఒక్క విధంగా వ్యక్తపరుస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఓ టాప్ ఎండ్ వేతన జీవి తన కష్టాన్ని ఒక ట్వీట్ రూపంలో నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో అది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతను ఎవరు? ఎందుకు ట్వీట్ చేశాడు? చాలామంది ఎందుకు దానికి కనెక్ట్ అవుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ఏడాదికి 25 లక్షలు వస్తున్నప్పటికీ..

సౌరవ్ దత్త.. ఉత్తర భారతదేశానికి చెందిన ఇతడు ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. నెలకు 1.50 లక్షలు వేతనంగా వస్తుంది. ఆరు లక్షలు అదనపు భత్యాల కింద లభిస్తాయి. మొత్తంగా అతడికి 25 లక్షలు వస్తాయి. అతడికి భార్య, ఒక కుమారుడు సంతానం. మీరు ముగ్గురు కమ్యూనిటీలో నివాస ఉంటున్నారు.. ఇతడికి వచ్చే 1,50,000 వేతనంలో EMI కి లక్ష వరకు వెళ్తుంది. ఇంటి కిరాయి 25000, ఫుడ్, సినిమాలు, మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర ట్రిప్స్ కు 25 వేల దాకా ఖర్చవుతుంది. మొత్తంగా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు.. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పొదుపు చేద్దామంటే సాధ్యం కావడం లేదని.. సౌరవ్ ట్వీట్ చేశాడు. దీంతో చాలామంది అతని ట్వీట్ కు స్పందించారు..” ఆదాయం పెరిగినప్పటికీ.. ఖర్చులు అంతకుమించాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నగరంలో బతకడం అంటే నరకం కనిపిస్తోంది. ఎంత ఖర్చు తగ్గిద్దామన్నప్పటికీ సాధ్యం కావడం లేదని” చాలామంది వాపోతున్నారు.

ఓ నివేదిక ప్రకారం

మనదేశంలో ఉద్యోగాలు, ఆదాయ వ్యయాలపై ఆమధ్య ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. ఉద్యోగ కల్పన మెరుగ్గానే ఉన్నప్పటికీ.. బయట పెరిగిపోయిన ఖర్చుల వల్ల చాలామందికి వేతనాలు సరిపోవడం లేదు. పై స్థాయిలో ఉంటే ఉద్యోగుల పరిస్థితి కూడా అలానే ఉంది. చాలామంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. కార్లు, బంగ్లాలు, బంగారం, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల EMI లు చెల్లించాల్సి వస్తోంది.. చాలామందిలో సింహభాగం వేతనం దీనికే వెళ్తోంది. అందువల్ల చాలామంది ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు.. లగ్జరీ లైఫ్ అనుభవించాలనే కోరిక చాలామందిలో ఉండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు.. ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని.. కానీ ఇలాంటి పని ఎవరూ చేయడం లేదని వారు వాపోతున్నారు. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని.. లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.