MLC Duvvada : దివ్వెల మాధురి పై ప్రేమతో.. దువ్వాడ శ్రీనివాస్ చేసిన పని హాట్ టాపిక్.. ఆడియో వైరల్*

ఏపీలో మీడియాకు దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆహారంగా మారింది. ఇప్పటివరకు కుటుంబ వివాదాలు నడుస్తుండగా.. మరోవైపు బెదిరింపుల పర్వం బయటపడుతోంది. అది కూడా మాధురి కోసమే కావడం గమనార్హం.

Written By: Dharma, Updated On : August 13, 2024 10:43 am

Duvvada Srinivasa Rao

Follow us on

MLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన తన స్నేహితురాలు మాధురి కోసం నిత్యం పరితపించే వారని తెలుస్తోంది. తాజాగా ఒక వ్యవహారం బయటపడింది. ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారితో దురుసుగా ప్రవర్తించారు ఎమ్మెల్సీ దువ్వాడ. ఏకంగా బెదిరింపులకు దిగారు. అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధిన పడ్డ ఎమ్మెల్సీ.. ఈ వివాదంతో మరింత ఎరుకును పడ్డారు. ఆయన సన్నిహితురాలు దివ్వల మాధురికి టెక్కలి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉండేది. నిబంధనలు పాటించకపోవడం, రెన్యువల్ చేయకపోవడంతో బంకు నిలిచిపోయింది. సంబంధిత సంస్థ డీలర్ షిప్ ను కూడా రద్దు చేసింది. అనుమతులు సైతం ఎప్పుడో రద్దయ్యాయి. అయితే ఆ బంకు నిర్వహణ కోసం మాధురి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ సంస్థ నుంచి అనుమతులు రాలేదు. దీంతోదువ్వాడ శ్రీనివాస్ సదరు కంపెనీని ఆశ్రయించారు. పెట్రోల్ బంక్ అనుమతులకు సంబంధించి ఓ అధికారి బాధ్యతలు వహిస్తున్నారు. నేరుగా సదరు అధికారికి దువ్వాడ ఫోన్ చేశారు. తక్షణం పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వాలని కోరారు. అయితే అది కుదిరే పని కాదని.. ఎప్పుడో ఆ బంకు డీలర్ షిప్ రద్దయిందని చెప్పుకొచ్చారు సదరు ప్రతినిధి. అయితే పోర్టు నిర్మాణానికి రోజుకు 20 వేల లీటర్ల ఆయిల్ అవసరం అని.. తక్షణం బంకు తెరిపించాలని కోరారు దువ్వాడ. అయితే అది సాధ్యం కాదని సదరు ప్రతినిధి తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా రంకెలు వేశారు. తాను ఎమ్మెల్సీనని.. రోడ్డున పోయే వ్యక్తిని కాదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీంతో సదరు ప్రతినిధి మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారని అడిగారు. అసలు మీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీంతో మరింత రెచ్చిపోయారు దువ్వాడ. దానికి ధీటుగానే సమాధానం చెప్పారు సదరు ప్రతినిధి. మీరు అరచినంత మాత్రాన భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అవుతోంది.

* ఐదేళ్లుగా దూకుడు తనమే
ఐదేళ్ల వైసిపి పాలనలో దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా వ్యవహరించారు.అధికారులతో పాటు రాజకీయ ప్రత్యర్థులను బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.గతంలో కింజరాపు కుటుంబం స్వగ్రామమైన నిమ్మాడ వెళ్లి మరి తొడగొట్టారు.ఆ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.పార్టీ శ్రేణులతో వెళ్లి దాడి చేసినంత ప్రయత్నం చేశారు. ఈ ఘటన తరువాతే జగన్ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాధాన్యం పెంచారు.

* కొలిక్కి వస్తుందనగా..
గత వారం రోజులుగా దువ్వాడ ఎపిసోడ్ తెలుగు రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా.. అదే రచ్చ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ ఫ్యామిలీ వివాదం కొలిక్కి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే ఓ ఆయిల్ కంపెనీ ప్రతినిధిని బెదిరించడం చర్చకు దారితీస్తోంది. దువ్వాడ వ్యవహార శైలి పై ముప్పేట విమర్శలు వినిపిస్తున్నాయి.

* తెరపైకి కొత్త కేసులు
కుటుంబ వివాదాలు చలవన్నట్టు ఇప్పుడు దువ్వాడ మెడకు కొత్త కేసులు చుట్టుముడుతున్నాయి. త్వరలో ఆయనపై మరిన్ని అభియోగాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ ఆడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రధాన మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వైసీపీ హై కమాండ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ కావడం లేదు.