https://oktelugu.com/

ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించిన సోనూసూద్!

సోనూసూద్ రీల్ లైఫ్ లో విలన్… ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి సోనూసూద్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం సోనూసూద్ హీరోనే. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా సాయం చేసి సోనూసూద్ వార్తల్లో నిలిచాడు. కష్టాలు పడుతున్న ఎంతో మందిని ఆదుకుని పేరు తెచ్చుకున్నాడు. Also Read : సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి! కష్టకాలంలో ఎంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 24, 2020 / 07:45 PM IST
    Follow us on

    సోనూసూద్ రీల్ లైఫ్ లో విలన్… ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి సోనూసూద్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం సోనూసూద్ హీరోనే. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా సాయం చేసి సోనూసూద్ వార్తల్లో నిలిచాడు. కష్టాలు పడుతున్న ఎంతో మందిని ఆదుకుని పేరు తెచ్చుకున్నాడు.

    Also Read : సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి!

    కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్ ప్రశంసలు అందుకున్నారు. చేతికి ఎముకే లేదనే విధంగా అడిగిన వారికి చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా సోనూసూద్ కు లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన సోనూసూద్ వారి కోసం ప్రత్యేకంగా వైఫైను ఏర్పాటు చేశారు.

    మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్ధిని ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంతో ఎంతో శ్రమిస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి చిన్న గుడిసె వేసుకుని చదువుకునేది. అక్కడ ఆమె ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతోంది. ఆమె చదువు కోసం పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్న సోనూసూద్ ఆమె కోసం వైఫైను ఏర్పాటు చేశాడు.

    Also Read : వలస కార్మికులకు విమాన టికెట్లు బుక్‌ చేసి నెటిజన్ల మనసు దోచిన రైతు!