ఆ పదార్దాలపై మూడు వారాల పాటు కరోనా జీవించే ఉంటుందట!

ఆహార పదార్థాలపై కరోనా ఉంటుందా…? ఉండదా…? అని మనలో చాలామందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఆహారపదార్థాల ద్వారా కరోనా వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు భయపడవద్దని చెప్పింది. Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 […]

Written By: Navya, Updated On : August 25, 2020 10:34 am
Follow us on

ఆహార పదార్థాలపై కరోనా ఉంటుందా…? ఉండదా…? అని మనలో చాలామందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఆహారపదార్థాల ద్వారా కరోనా వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు భయపడవద్దని చెప్పింది.

Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?

అయితే తాజా అధ్యయనంలో కరోనా వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజా అధ్యయనంలో ఆహార పదార్థాలపై మూడు వారాల వరకు కరోనా వైరస్ జీవించి ఉండగలదని తేలింది. గడ్డకట్టిన మాంసం, చేపలపై వైరస్ యాక్టివ్ గా ఉండగలదని ఈ అధ్యయనం నిర్ధారించింది. కలుషితమైన ఆహారం వల్లే దక్షిణ కొరియాలో తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ పరిశోధనలో గడ్డకట్టిన ఆహారంపై కరోనా వైరస్ మూడు వారాల పాటు జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనాలోని షెంజెన్ లో గడ్డకట్టిన చికెన్ రెక్కల మాంసంలో కరోనా వైరస్ ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం అధికారుల పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. ఇది మరవక మునుపే గడ్డకట్టిన మాంసంపై కరోనా వైరస్ ఉంటుందనే వార్త ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. వైరస్ లు సజీవ హోస్ట్ లేకుండా అవి సొంతంగా మనుగడ సాగించలేవు. అందువల్లే వైరస్ లు నోరు, ముక్కు తుంపర్ల ద్వారానే వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందుతునన్ట్టు తెలుస్తోంది.

Also Read : కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు!