Homeఎంటర్టైన్మెంట్ఆర్జీవీకి షాక్‌.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్

ఆర్జీవీకి షాక్‌.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్

Shock to RGV .. Court break for ‘Murder’ release

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. నా సినిమాలు నా ఇష్టం అంటూ ఇష్టం వచ్చిన అంశాలపై చిత్రాలు తీస్తూ జనాలపైకి వదులుతున్న ఆర్జీవీ జోరుకు  ఓ న్యాయస్థానం బ్రేకులేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ  ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా వర్మ తీసిన ‘మర్డర్’ సినిమా విడుదలను కోర్టు అడ్డుకుంది.  ఈ మేరకు ప్రణయ్‌ భార్య అమృత, ఆమె అత్తామామలు వేసిన పిటిషన్‌ను విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

వాస్తవ ఘటనలు, రియల్‌ లైఫ్ క్యారెక్టర్లతో సినిమాలు తీయడంలో ఆరి తేరిన రాము.. ప్రణయ్‌- అమృత ప్రేమ కథ, ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా ‘మర్డర్’ అనే సినిమా ప్రకటించినప్పటి నుంచి దానిపై వివాదం చెలరేగుతోంది.  కుటుంబ కథా చిత్రం అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీలో  అచ్చం ప్రణయ్‌, అమృత, ఆమె తండ్రి మారుతీరావు పోలిన క్యారెక్టర్లను దింపాడు రాము. దీనిపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, రాము మాత్రం ఇది నిజజీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమానే కానీ.. ఇదే నిజమైన కథ కాదు… ప్రణయ్‌ హత్య తర్వాత జరిగిన పరిణామాలను, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న  విషయాలతో  కథ అల్లానని  తన మార్కు వివరణ ఇచ్చుకున్నాడు. ఆయన ట్వీట్ల మాదిరిగానే ఈ వివరణ ఎవ్వరికీ అర్థం కాలేదు. కోర్టును ఆశ్రయిస్తానని అమృత హెచ్చరించినా కూడా ఏ మాత్రం  లెక్కచేయని  రాము.. ఫాదర్స్‌ డే సందర్భంగా మూవీని అనౌన్స్‌ చేశాడు. ఆపై, పోస్టర్, ఒక్క డైలాగ్‌ లేకుండా ట్రైలర్ కూడా రిలీజ్‌ చేశాడు. తానే స్వయంగా పాడిన రెండు పాటలను సైతం విడుదల చేసి ‘మర్డర్’కు కావాల్సిన పబ్లిసిటీ, కాంట్రవర్సీ క్రియేట్‌ చేసుకున్నాడు.
అయితే, పోస్టర్స్‌, ట్రైలర్ చూసిన తర్వాత అమృత, ఆమె కుటుంబ సభ్యులు నల్లొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టును ఆశ్రయించారు. తనను సంప్రదించకుండా, తన అంగీకారం లేకుండా తన జీవితంలో జరిగిన విషాదాన్ని సినిమాగా మలిచి వర్మ డబ్బులు సంపాదించాలని చూస్తున్నాడని కేసు వేసింది. తన అత్తామామల కులాన్ని  కూడా వర్మ కించపరుస్తున్నాడని ఆరోపించింది. అలాగే, ప్రణయ్‌ కేసులో సాక్షులను ఈ సినిమా ప్రభావితం చేయగలదని తన పిటిషన్‌లో పేర్కొంది.  ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు విచారణ పూర్తయ్యే వరకూ సినిమా విడుదల నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, వర్మకు షాక్‌ తగలగా.. సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. అయితే, స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వర్మ తరఫు న్యాయవాది చెప్పారు. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. అంతకంటే ముఖ్యంగా కేసులో  వాదోపవాదాలు పూర్తయ్యే వరకూ సినిమా విడుదలకు ఆస్కారం ఉండబోదు. దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తి కరం.
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version