https://oktelugu.com/

ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?

సాధారణంగా విషం ఉన్న పాము కాటు వేస్తే చనిపోతారనే సంగతి తెలిసిందే. అయితే ఒక గ్రామంలో మాత్రం పాము కాటు వేసినా చనిపోరు. విచిత్రం ఏమిటంటే ఆ గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలోని నాగేన హళ్లి అనే గ్రామంలో పాములు కరిచినా మనుషులకు ఏం కాదు. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఇలా జరగడానికి కారణం కనిపెట్టలేకపోవడం గమనార్హం. Also Read: లాక్ డౌన్లో పెరిగిన ధనవంతుల ఆదాయం తాచుపాముల గ్రామంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 25, 2021 / 03:53 PM IST
    Follow us on

    సాధారణంగా విషం ఉన్న పాము కాటు వేస్తే చనిపోతారనే సంగతి తెలిసిందే. అయితే ఒక గ్రామంలో మాత్రం పాము కాటు వేసినా చనిపోరు. విచిత్రం ఏమిటంటే ఆ గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలోని నాగేన హళ్లి అనే గ్రామంలో పాములు కరిచినా మనుషులకు ఏం కాదు. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఇలా జరగడానికి కారణం కనిపెట్టలేకపోవడం గమనార్హం.

    Also Read: లాక్ డౌన్లో పెరిగిన ధనవంతుల ఆదాయం

    తాచుపాముల గ్రామంగా పిలవబడే ఈ గ్రామంలో ఎవరైనా పాముకాటుకు గురైతే వారిపై విషం పని చేయదు. అయితే గ్రామంలో ఉన్నంత వరకు మాత్రమే విషం పని చేయదు. గ్రామం పొలిమేర దాటి వెళితే మాత్రం చనిపోతారు. సర్ప శాస్త్రవేత్తలు సైతం ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తాము చెప్పలేకపోతున్నామని చెబుతున్నారు. గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారికి పాము కాటు వేస్తే మాత్రం ఆ పామును స్మశానం దగ్గర ఉన్న యతీశ్వర మండపం దగ్గర ఉంచుతారు.

    Also Read: అర్నబ్ టీఆర్పీ కోసం అంతపని చేశాడా..?

    ఆ తరువాత పాము ఎవరిని కాటు వేసిందో ఆ వ్యక్తి హనుమాన్ ఆలయంలో తీర్థం తీసుకుని మరునాడు ఉదయం వరకు గుడిలో నిద్ర పోతే విషం నిర్వీర్యం అయిపోతుంది. గ్రామంలో ఈ విధంగా పాము కరిచినా ఎందుకు చనిపోరనే ప్రశ్నకు గ్రామస్తులు ఒక కథను చెబుతున్నారు. పూర్వం ఆ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు ఉండేవారని ఆ సాధువుకు ఒకరోజు పొదల్లో బిడ్డ దొరికిందని ఆ పెంపుడు బిడ్డ 12 సంవత్సరాల వయస్సులో సర్పం వల్ల మృతి చెందాడని గ్రామస్తులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    పెంపుడు బిడ్డ మృతి చెందడంతో సాధువు నాగరాజును శపించడానికి ప్రయత్నించగా నాగరాజు సాధువును క్షమించమని వేడుకుని బిడ్డను బ్రతికించాడని.. సాధువు కోరిక మేరకు గ్రామంలోని నాలుగు సరిహద్దు బండరాళ్లు ఉన్నంత వరకు పాము కాటు వేసినా చనిపోరని గ్రామస్తులు చెబుతున్నారు.