
గులాబీనేతల మాటలు అధిష్టానానికి ముళ్ల కిరీటంగా మారుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ మనుసులోని మాటలు బయటికి వెల్లడించడంతో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండగా.. టీఆర్ఎస్ నేతలలో ఒకవైపు కలవరం మొదలవుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు అధికారంలో ఉన్నా.. ఏం చేయలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నామని.. అంటుండగా.. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓ ప్రయివేటు కంపెనీలా మారిపోయిందని.. ఆవేదన వ్యక్తం చేశారు. స్చేచ్ఛ పోయిందని.. కవులకు, కళాకారులకు.. మౌనంగా కేన్సర్ కన్నా ప్రమాదకరమని అన్నారు.
Also Read: కేటీఆర్ టీంలో పొంగులేటి.. కీలక పదవి ఖాయం..?
సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండడం కేన్సర్ కన్నా.. ప్రమాదకమరంటూ.. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహబూబ్ బాద్ లో ప్రముఖ కవి జయరాజు సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో సహజత్వాన్ని కోల్పోయానన్నారు. ప్రస్తుతం తాను ఓ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడం కారణంగా అందరికీ దూరం అయ్యానని అన్నారు. రసమయి వ్యాఖ్యలు ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్ పాలను ప్రశంసిస్తూ.. సభలో గళమందుకున్న రసమయి.. ప్రస్తుతం ఈ రాగం ఎందుకు తీశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
Also Read: కేటీఆర్ ‘దక్షిణాది‘ జపం
ఓ కళాకారుడు ప్రజాప్రతినిధిగా ఉండడం వల్ల అన్నింటికీ దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రసమయి అన్నారు. ఏ విషయంలోనూ మాట్లాడని సందర్భంలో తాను ఉన్నానని అన్నారు. మాట, పాట అదుపులో పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ పోయిందని.. ఇలాంటి జీవితం తాను కోరుకోలేదని వ్యాఖాయనించారు. ఆకలిని అయినా చంపుకుని ఆత్మఅభిమానంతో బతికేవాడిని తానని అన్నారు. అందరి ఆశిస్సులతో ఈరోజు ఇక్కడ ఉన్నానని.. పవర్ ఉంటేనే తమకు చప్పట్లు కొడతారని.. అన్నారు. పార్టీ ఓ కంపెనీలా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మనుసులోని బాధను వెలిబుచ్చారని పలువురు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఈ వ్యాఖ్యలు ఇప్పడు రాజకీయంగా రాష్ర్టవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి. ఎమ్మెల్యేల వరుస కామెంట్లు.. టీఆర్ఎస్ లో వారి పరిస్థితిని గురించి చెబుతున్నాయి. అయితే ఓ కళాకారుడిగా తన ఆవేదనను పంచుకున్నాడని టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. పార్టీలో బానిసత్వం పెరిగిపోతుందని.. నియంత పాలనకు ఇదే సాక్ష్యం అని పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు.