2020 సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడుపోయిన కారు ఏదో తెలుసా..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది ప్రజల ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రజలు గతంతో పోలిస్తే ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అత్యవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా గతేడాది కార్ల విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే విక్రయాలు తగ్గినా కరోనా సంక్షోభంలో సైతం ఒక కారు ఎక్కువగా అమ్ముడుపోయి రికార్డులకు ఎక్కడం గమనార్హం. Also Read: ఏపీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళ మృతి.. ఏం జరిగిందంటే..? మారుతి సుజుకికి చెందిన […]

Written By: Kusuma Aggunna, Updated On : January 26, 2021 11:02 am
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది ప్రజల ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రజలు గతంతో పోలిస్తే ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు అత్యవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా గతేడాది కార్ల విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే విక్రయాలు తగ్గినా కరోనా సంక్షోభంలో సైతం ఒక కారు ఎక్కువగా అమ్ముడుపోయి రికార్డులకు ఎక్కడం గమనార్హం.

Also Read: ఏపీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళ మృతి.. ఏం జరిగిందంటే..?

మారుతి సుజుకికి చెందిన స్విఫ్ట్ కారు ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మన దేశంలో గతేడాది 1,60,700 యూనిట్లతో బెస్ట్ సెల్లింగ్ కారుగా ఈ కారు రికార్డులను సొంతం చేసుకుంది. 2005 సంవత్సరంలో మారుతి స్విఫ్ట్ కారు లాంఛ్ అయింది. ఇప్పటివరకు 23 లక్షల యూనిట్ల మారుతి స్విఫ్ట్ కార్ల అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. 2016 సంవత్సరంలో 15 లక్షల మార్కును సొంతం చేసుకుంది.

Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?

మారుతి సుజికి ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ ఈ విషయాలను వెల్లడించారు. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఎక్కువగా ఈ కారును కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 53 శాతం మంది 35 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లే ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కారు యువతరం మనస్సును దోచుకుందని కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

స్పోర్టీ డిజైన్‌, అందుబాటులో ఉన్న ధర ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేయడానికి కారణమైందని చెప్పవచ్చు. మిగతా కంపెనీల కార్లు కూడా బాగానే అమ్ముడైనా ఈ కారు స్థాయిలో మాత్రం విక్రయాలు జరగలేదనే చెప్పాలి.