Smriti Mandana is beautiful in a saree : ఆడపిల్లలు అలంకరించుకుంటే అందంగా ఉంటారు. వారికి అలంకరణే ఆకర్షణగా ఉంటుంది. దీంతో మహిళలు అలంకార ప్రియులు. తమ అందాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అద్దం ముందు నిలబడ్డారంటే అంతే. ఆడవారు అందానికి ప్రతీకలుగా నిలుస్తుంటారు. ఎందరో కవులు వారి అందాన్ని పొగిడారు. అందంలో వారికి సాటి ఎవరు రారు. వారే అందరిని ఆనందంగా ఉంచుతారు. ప్రస్తుత ప్రపంచంలో వారికి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. మగవారితో సమానంగా అన్నింట్లో రాణిస్తున్నారు. ఏ రంగం తీసుకున్నా మహిళల ప్రాతినిధ్యం లేనిదే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారు ఉద్యోగాలు చేస్తూ ఇంటిని బాగుచేస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
భారత మహిళా క్రికెట్ టీం ఓపెనర్ స్మృతి మందాన గురించి అందరికి తెలిసిందే. ఆమె క్రికెట్ లోకి అడుగుపెట్టిన నుంచి ఆమెకు వేరే డ్రెస్ వేసుకునే అవకాశం రాలేదు. ఎప్పుడు చూసినా జెర్సీ దుస్తుల్లోనో జీన్స్ టీ షర్ట్ తోనో కనిపించేది. కానీ ఇటీవల ఆమె సంప్రదాయబద్ధంగా లంగా ఓనీలో కనిపించడంతో అందరు అవాక్కయ్యారు. స్మృతి మందాన కట్టుబొట్టు చూసి అందరు మురిసిపోతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఇంత అందంగా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు. స్మృతి మందానకు చాలా మంది అభిమానులున్నారు.
ఆడపిల్లకు బట్టలే అందం. మన సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరిస్తే ఆమెలోని అందం మరింత ఇనుమడించింది. ఎప్పుడు ఏవో దుస్తుల్లో కనిపించే ఆమె ఇలాంటి తీరుగా దర్శనం ఇవ్వడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె ఫ్యాన్స్ వావ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. సో బ్యూటీఫుల్, క్వీన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి స్మృతి మందాన కట్టుబొట్టుకు అందరు ఆకర్షితులవుతున్నారు. ఆ వేషధారణలో ఆమె దేవతలా ఉందని కీర్తిస్తున్నారు.
స్మృతి మందాన ఐససీీ టీ20 ర్యాంకింగ్ లో రెండో స్థానంలో, వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తన ఆటతో అందరిని మంత్రముగ్దులను చేస్తుంది. బ్యాట్ పట్టుకుందంటే పరుగుల వరద పారాల్సిందే. తనదైన శైలిలో క్రికెట్ లో రాణిస్తున్న ఈ ముంబై కి చెందిన స్మృతి భవిష్యత్ లో వరల్డ్ కప్ సాధించాలనేది ఆమె కల. తన జీవితంలో ఒక్కసారైనా వరల్డ్ కప్ సొంతం చేసుకుని దేశానికి అంకితం ఇవ్వాలనేదే జీవితాశయం. ఇంత బిజీగా ఉండే స్మృతి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోవడం కూడా ఒక గమ్మత్తుగానే ఉందని అభిమానులు స్తుతిస్తున్నారు.