Homeజాతీయ వార్తలుRamagundam Fertilizers : డాలర్ మారకంతో పెరిగిపోతున్న సబ్సిడీ: ‘రామగుండం’ కేంద్రాన్ని గట్టెక్కిస్తుందా?

Ramagundam Fertilizers : డాలర్ మారకంతో పెరిగిపోతున్న సబ్సిడీ: ‘రామగుండం’ కేంద్రాన్ని గట్టెక్కిస్తుందా?

Ramagundam Fertilizers : చాలామంది కూడా దేశ అవసరాలకు చమురే కీలకం అనుకుంటారు.. మన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధిక భాగం కేంద్ర ప్రభుత్వం వాటి కోసమే ఖర్చు చేస్తుంది అని భావిస్తారు. చమురు కోసం మన దేశం గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతుంది.. అది ఒకటే కాకుండా ఎరువులకు కూడా ఆ సౌదీ దేశాలే దిక్కు. ఇప్పటికే మన దేశానికి సంబంధించి యూరియా, డి ఎ పి వంటి అవసరాలను మొరాకో దేశం తీరుస్తోంది.. సౌదీ అరేబియా ప్రధాన ఎగుమతిదారుగా అవతరిస్తున్నది. విచిత్రం ఏంటంటే నష్టాల కారణంగా గతంలో వాజ్ పేయి ప్రభుత్వం ఎరువుల కర్మాగారాలను మూసివేసింది.. ఆ తర్వాత భారతీయ మార్కెట్లోకి సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ దేశాలు ప్రవేశించాయి. కీలకమైన ఎరువులను అవే సరఫరా చేస్తున్నాయి. అయితే ధరల విషయంలో పూర్తిగా మార్కెట్ సూత్రాలను అనుసరిస్తున్నాయి.. దీంతో భారత్ చాలా ఇబ్బంది పడుతోంది.. సౌదీ అరేబియాలోని మాదాన్ సంస్థలో తమకు వాటా ఇచ్చి భాగస్వామ్యం కల్పించాలని మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ సౌదీ అరేబియా పట్టించుకోవడం లేదు..

యూరియా ఉత్పత్తి ఇలా

దేశీయంగా యూరియా విరివిగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ దిగుమతుల్లో దానిదే సింహ భాగంగా ఉంటున్నది. ప్రభుత్వం వెచ్చిస్తున్న రాయితీల్లో 70 శాతం యూరియాకే చెల్లిస్తోంది. గత ఏడాది 1.62 లక్షల కోట్లు ఉన్న రాయితీ.. ఈ ఏడాది 2.50 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఎరువుల దిగుమతులను క్రమేణా తగ్గించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది.. అందులో రామగుండం ఫ్యాక్టరీ ఒకటి.. వచ్చే మూడు సంవత్సరాలలో విదేశాల నుంచి యూరియా దిగుమతిని పూర్తిగా తగ్గిస్తామని చెబుతున్న కేంద్రం… మరోవైపు భారతదేశానికి అత్యధికంగా ఎరువులను సరఫరా చేసే సౌదీ అరేబియా తో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని కుదిరితే సంయుక్త భాగస్వామ్యంలో ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నది. భారత్ లో ప్రసిద్ధిగాంచిన సింద్రీ తో పాటు ఎనిమిది ఎరువుల కర్మకారాలను నష్టాల కారణంగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం మూసివేసింది.. అయితే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామగుండం కర్మాగారం పునరుద్ధరణలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది. మొత్తం ఖర్చులో 11% భరించేందుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్న తర్వాతే వ్యవహారంలో కదలిక వచ్చింది.. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వచ్చినప్పుడు… కెసిఆర్ వెళ్లకపోవడం విస్మయాన్ని కలిగించింది.

అదానికి అప్పగించేది ఆగిపోయింది.

గుజరాత్ పై ప్రత్యేక అభిమానం ప్రదర్శించే కేంద్ర ప్రభుత్వం… ఎరువుల రంగంలోనూ క్రిబ్ కో.. కోరమాండల్ కంటే ఎక్కువగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఎరువుల సంస్థను ప్రమోట్ చేస్తూ ఉంటుంది.. ముందు ఇరాన్ లో, ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తోంది. దీనికి తోడు కచ్ ఫెర్టిలైజర్స్ పేరిట ఆదాని గ్రూప్ ఇప్పటికే అవకాశాలను పరిశీలిస్తుండగా.. సింద్రి పునరుద్ధరణ బాధ్యతను కూడా అదానికే అప్పగిస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అది వీలుపడలేదు. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version