
Sir Collection: తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో ఎంట్రీ ఇస్తూ చేసిన చేసిన మొట్టమొదటి చిత్రం ‘సార్’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపేసిన సంగతి అందరికీ తెలిసిందే.తెలుగు లో మొదటి సినిమాతోనే ధనుష్ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడని బహుశా ధనుష్ కూడా ఊహించి ఉండదు.కేవలం కమర్షియల్ గా మాత్రమే కాదు,విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్న అతి తక్కువ సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం కూడా నిలిచింది.
విద్య యొక్క గొప్పతనాన్ని కమర్షియల్ ఫార్మటు లో డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన విధానం అద్భుతం అనే చెప్పాలి.ఓపెనింగ్స్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని నిర్మాతని మరియు బయ్యర్స్ ని లాభాల్లోకి నెట్టిన ఈ చిత్రం విడుదలై నేటికీ రెండు వారాలు అయ్యాయి.ఈ రెండు వారాల్లో తెలుగు మరియు తమిళం వేశాం కి కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం తెలుగు మరియు తమిళం వెర్షన్ కి కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 35 కోట్ల రూపాయలకు జరిగింది.తెలుగు లో మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది కానీ, తమిళం లో మాత్త్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి పది రోజుల సమయం పట్టింది.తెలుగు వెర్షన్ 14 రోజులకు కలిపి దాదాపుగా 17 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా తమిళ వెర్షన్ కి 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలా రెండు భాషలకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మరియు 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అయితే తెలుగు లో ఈ సినిమా 20 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ అది ప్రస్తుతానికి కష్టమే అని అర్థం అవుతుంది.మొదటి వారం తో పోలిస్తే రెండవ వారం వసూళ్లు బాగా తగ్గిపోయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..కానీ తెలుగు వెర్షన్ ఇప్పటికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.