https://oktelugu.com/

Manchu Vishnu Daughters: ఊహించిన పరిణామం…. మంచు విష్ణును ఏడిపించేసిన ఇద్దరు కూతుళ్లు!

Manchu Vishnu Daughters: తన ఇద్దరు కూతుళ్లు చేసిన పనికి మంచు విష్ణు కన్నీరు పెట్టుకున్నారట. భావోద్వేగానికి గురయ్యారట. తన ఎమోషన్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు నలుగురు పిల్లలు కాగా… మొదటి సంతానం ట్విన్ గర్ల్స్. ఈ అమ్మాయిలకు అరియానా, వివియానా అని పేర్లు పెట్టారు. వీరిద్దరూ టీనేజ్ కి వచ్చేశారు. ఇద్దరు అమ్మాయిలు మంచి టాలెంటెడ్ కూడాను. ముఖ్యంగా పాటలు బాగా పాడతారు. మంచు విష్ణు లేటెస్ట్ మూవీ జిన్నా లో ఫ్రెండ్షిప్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 2, 2023 / 05:58 PM IST
    Follow us on

    Manchu Vishnu Daughters

    Manchu Vishnu Daughters: తన ఇద్దరు కూతుళ్లు చేసిన పనికి మంచు విష్ణు కన్నీరు పెట్టుకున్నారట. భావోద్వేగానికి గురయ్యారట. తన ఎమోషన్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు నలుగురు పిల్లలు కాగా… మొదటి సంతానం ట్విన్ గర్ల్స్. ఈ అమ్మాయిలకు అరియానా, వివియానా అని పేర్లు పెట్టారు. వీరిద్దరూ టీనేజ్ కి వచ్చేశారు. ఇద్దరు అమ్మాయిలు మంచి టాలెంటెడ్ కూడాను. ముఖ్యంగా పాటలు బాగా పాడతారు. మంచు విష్ణు లేటెస్ట్ మూవీ జిన్నా లో ఫ్రెండ్షిప్ సాంగ్ ఆలపించారు. కాగా ఈ చిచ్చర పిడుగులు అమ్మానాన్నలకు పెళ్లిరోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

    ప్రముఖ అమెరికన్ సింగర్ జాక్స్ రూపొందించిన ‘లైక్ మై ఫాదర్’ సాంగ్ కి కవర్ సాంగ్ చేశారు. తల్లిదండ్రుల మధ్య ప్రేమను తెలియజేస్తూ ఒక కూతురు పాడే ఆ సాంగ్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కవర్ సాంగ్ ని అరియానా ఒరిజినల్ సింగర్ ని మరిపిస్తూ అద్భుతంగా పాడింది. సదరు వీడియో బ్యాక్ గ్రౌండ్ లో నాన్న విష్ణు, అమ్మ విరానికా అరుదైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలు జత చేశారు. ఇక ఈ వీడియోపై తన స్పందన తెలియజేస్తూ మంచు విష్ణు సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

    Manchu Vishnu Daughters

    సాంగ్ ముగిసే వరకు నాకు కన్నీరు ఆగలేదు. నా చిన్ని తల్లులు అరియానా, వివియానాలకు థాంక్స్. ఈ సాంగ్ నా ఈ రోజును అద్భుతంగా మార్చింది. జీవితంలో ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మర్చిపోను…. అని ట్వీట్ చేశారు. అలాగే కూతుళ్లు రూపొందించిన మ్యారేజ్ డే గిఫ్ట్ సాంగ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కజిన్ విరానికా రెడ్డిని మంచు విష్ణు 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మార్చి 1న వీరి మ్యారేజ్ యానివర్సరీ నేపథ్యంలో అరియానా, వివియానా ఇలా అందమైన గిఫ్ట్ ప్లాన్ చేశారట.

    మ్యారేజ్ డే సందర్భంగా మంచు విష్ణు సైతం ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మా నాన్న కంటే కూడా నేను ఎక్కువగా భయపడే పర్సన్ విరానికా రెడ్డి అని ఆయన కామెంట్ చేశారు. భార్య అంటే భయం అని చెప్పడం ద్వారా… ఆమెపై తనకున్న రెస్పెక్ట్, లవ్ పరోక్షంగా తెలియజేశారు. ఇక మంచు విష్ణు ఒక్క హిట్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు సక్సెస్ రావడం లేదు. మంచు విష్ణు లేటెస్ట్ రిలీజ్ జిన్నా సైతం నిరాశపరిచింది. పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

    Tags