
Virupaksha Teaser: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘విరూపాక్ష’ చిత్రం వచ్చే నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్లి వచ్చిన తర్వాత చేసిన మొదటి సినిమా ఇది.దానికి తోడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం,మొదటి గ్లిమ్స్ తోనే ఎదో కొత్తతరహా సినిమా అని అందరికీ అర్థం అయ్యేలా చెయ్యడం తో ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు బాగా ఏర్పడ్డాయి.

ఇక ఈరోజు విడుదల చేసిన టీజర్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూఢనమ్మకాల మీద తీసిన ఈ సినిమా అజ్ఞానం తో నిండిపోయిన ఒక గ్రామా ప్రజలను మోసం చేస్తూ వాళ్ళను కొంతమంది దోచుకునే ప్రయత్నం నుండి హీరో ఎలా కాపాడాడు అనే అంశం పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక ఈరోజు విడుదల చేసిన టీజర్ లో ఒళ్ళు గాగురుపొడిచే షాట్స్ ని మనం చూడొచ్చు.ముఖ్యంగా బావిలోకి మనిషిని పడిపోతున్న షాట్ ని చూస్తే వెన్నులో వణుకు వచ్చేస్తుంది.టీజర్ మొత్తం చూసిన తర్వాత కచ్చితంగా థియేటర్ లో చూస్తే కానీ గూస్ బంప్స్ అనుభవం రాదు అనే విషయం అర్థం అవుతుంది.ఇక ఈ టీజర్ ఆఖరిలో కమెడియన్ సునీల్ ని మనం చూడొచ్చు.

ఆయన ఎక్సప్రెషన్స్ బట్టి చూస్తూనే ఇందులో ఆయన నెగటివ్ రోల్ చేసాడనే విషయం అర్థం అవుతుంది.మన టాలీవుడ్ లో హారర్ సినిమాలు కొత్తేమి కాదు, కానీ చెప్పే విధానం లో కొత్తదనం ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించొచ్చు. పాన్ ఇండియా వైడ్ కూడా ఇలాంటి సబ్జక్ట్స్ ని జనాలు ఇరగబడి చూసేస్తున్నారు, మరి ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.
