https://oktelugu.com/

కాపురానికి వచ్చిన కోడలు అత్తకు రాసిన లెటర్ చదివితే అవాక్కవ్వాల్సిందే?

అత్తగారికి నమస్కారాలు.. మీ ఇంటికి కోడలినైన నాపై అత్తగారు చూపిస్తున్న ప్రేమాభిమానులకు ధన్యవాదాలు. వారానికి ఐదురోజుల పాటు నా పుట్టింటి తరపు బంధువులు వస్తుంటారు. అయితే మీ తరపు బంధువులను మాత్రం మన ఇంటికి ఎక్కువగా రాకుండా చూసుకుందాం. ఎందుకంటే ఇద్దరి తరపు బంధువులు వస్తే ఇబ్బందులు వస్తాయి. నేను వచ్చిన తర్వాత బీరువా తాళాల గుత్తిని మీ దగ్గర ఉంచుకోవద్దు.     నాకు అత్తగారు అంతపెద్ద బరువు బాధ్యతలను మోయడం అస్సలు ఇష్టం లేదు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 20, 2022 2:43 pm
    Follow us on

    అత్తగారికి నమస్కారాలు..

    మీ ఇంటికి కోడలినైన నాపై అత్తగారు చూపిస్తున్న ప్రేమాభిమానులకు ధన్యవాదాలు. వారానికి ఐదురోజుల పాటు నా పుట్టింటి తరపు బంధువులు వస్తుంటారు. అయితే మీ తరపు బంధువులను మాత్రం మన ఇంటికి ఎక్కువగా రాకుండా చూసుకుందాం. ఎందుకంటే ఇద్దరి తరపు బంధువులు వస్తే ఇబ్బందులు వస్తాయి. నేను వచ్చిన తర్వాత బీరువా తాళాల గుత్తిని మీ దగ్గర ఉంచుకోవద్దు.

     

     

    నాకు అత్తగారు అంతపెద్ద బరువు బాధ్యతలను మోయడం అస్సలు ఇష్టం లేదు. అసలే మీకు బీపీ ఉంది.. అందువల్ల ఇప్పటినుంచి ఆ బరువు బాధ్యతలను నేనే మోస్తాను. నేను మాంసాహారం తక్కువగానే తింటాను.. మాంసాహారం మసాలాలు మస్ట్.. ముక్క నమిలే సమయంలో బొక్క కొరికే సమయంలో అత్తను తాను కచ్చితంగా తలచుకుంటాను. ఉదయం సమయంలో తాను ఆరు ఇడ్లీల కంటే ఎక్కువ ఇడ్లీలను తినను.

    Also Read:  ఏపీని ఊరిస్తున్న ‘బిలియన్ డాలర్ల ఐడియా’.. అమలే కష్టం..

    అయితే నాకు రోలు మీద రుబ్బిన చట్నీ మాత్రమే నచ్చుతుంది.. పల్లీ చట్నీ కొంచెం రుచిగా ఉండేలా చూసుకుంటే మరీ బెటర్.. నాకు ఉదయం సమయంలో కాఫీ తాగే అలవాటు ఉంది. కొన్ని రోజుల క్రితం మీరు ఇచ్చిన కాఫీ నాకు తెగ నచ్చింది. రోజూ ఉదయం 8 గంటల సమయంలో అలాంటి కాఫీ ఒకటి ఇవ్వండి. ఆ కాఫీని తాగుతూ చచ్చేదాకా చాలా సంతోషంగా గడిపేస్తాను. అత్తయ్య ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ తాను తలదూర్చను.

    గిన్నెలు తోమడం, వంటలు చేయడం లాంటి పనులను గతంలో మీరు ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేయండి. ఇకనుంచి మీ కొడుకును నేను నా చుట్టూనే తిప్పుకుంటాను. మామగారికి ఈ వయస్సులో మీ తోడు అవసరం కాబట్టే ఇలా చేస్తున్నాను. నా గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆషాడం అయిన వెంటనే కారుతో పాటు మా ఆయనను పంపించండి. అదే సమయంలో మా ఆయనకు 2 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పండి. నా చెల్లి కూడా మీకు కోడలే కదా

    ఇట్లు
    అత్తకు ప్రేమతో
    కోడలు కాసుల రాజేశ్వరి

     

    Also Read:ఫిట్‌మెంట్ పంచాయితీ.. సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు..?