Chandrababu: వారానికో నేత‌ను చేర్చుకుంటారంట‌.. వారిపైనే చంద్ర‌బాబు ఆశ‌లు..

Chandrababu: ఏపీ రాజకీయాలు మంచి రసకందాయకంగా మారాయి. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మొన్నటివరకు సైలెంట్‌గా బాబు అసెంబ్లీలో జరిగిన ఘోర అవమానం తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ గద్దె దింపి ఏపీలో రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకు బాబు తన సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. ప్రజల్లో పార్టీకి పూర్వ వైభవం […]

Written By: Mallesh, Updated On : January 20, 2022 1:22 pm
Follow us on

Chandrababu: ఏపీ రాజకీయాలు మంచి రసకందాయకంగా మారాయి. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మొన్నటివరకు సైలెంట్‌గా బాబు అసెంబ్లీలో జరిగిన ఘోర అవమానం తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ గద్దె దింపి ఏపీలో రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని బాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకు బాబు తన సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. ప్రజల్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని సంకేతాలు పంపించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.దీని కోసం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట..

Chandrababu

ఎప్పుడైనా ఒక పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉంటే అందులోకి వలసలు అనేవి పెరుగుతుంటాయి. దీంతో పార్టీకి అదనపు బలం చేకూరుతుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి వారానికి ఒకరి చొప్పున వలసలను ప్రోత్సహించేందుకు బాబు సిద్ధమైనట్టు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ లేదా ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లను తన పార్టీలో చేర్చుకుని.. టీడీపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో జగన్‌‌ను ఓడిస్తామని గట్టి సంకేతాలు ఇవ్వాలని ప్రజలకు ఇచ్చేలా బాబు స్కెచ్ వేస్తున్నారని తెలిసింది.

Also Read: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?

ఏదైనా పార్టీ అధికారంలో ఉందంటే అందులోకి వలసలు కామన్. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం కూడా వలసలను ప్రోత్సహించితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, జగన్ పార్టీ మీద అసహనంతో ఉన్న వారంతా తిరిగి తన టీడీపీ వైపు చూస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకోసమే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నారట..

అందుకోసం వారికి ప్రత్యేకంగా ప్యాకేజిని కూడా ప్రకటిస్తున్నట్టు టాక్. ప్రతిపక్ష పార్టీలో పదవులు ఉండవు కాబట్టి ఈ విధంగా ప్యాకేజి డిసైడ్ చేశారట.. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చాలా రోజులైంది. ఆయనతో పాటు టీడీపీని వదిలి వైసీపీలో చేరి అక్కడ ఇమడలేకపోతున్న విశాఖకు చెందిన వాసుపల్లి గణేశ్ కుమార్.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొందరు కీలక నేతలు టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Also Read: చంద్రబాబుపై జగన్ కు ఎంత ప్రేమో బయటపడింది!

Tags