https://oktelugu.com/

Rajasthan: చిరుత పులి అయితే ఏంటి.. “పిట్ బుల్” ముందు దిగదుడుపే.. వైరల్ వీడియో

మనిషికి, కుక్కలకు మధ్య వందల సంవత్సరాల నుంచే అవినాభావ సంబంధం ఉంది. కుక్కలను మనుషులు ఎప్పటినుంచో పెంచుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో రకరకాల కుక్కలు అందుబాటులోకి వచ్చాయి. అవి విభిన్న రీతుల్లో కనిపిస్తాయి. అయితే ఈ కుక్కల్లో పిట్ బుల్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 11:43 AM IST

    Rajasthan

    Follow us on

    Rajasthan: పిట్ బుల్ జాతి కుక్కలు చూడ్డానికి చిన్నగానే ఉంటాయి. అయితే అవి దాడి చేస్తే తీవ్రంగా గాయాలవుతాయి. పైగా వాటి దంతాలు అత్యంత పదునుగా ఉంటాయి. వెంటాటి వేటాడుతాయి. పిక్కను పట్టుకున్నాయంటే వదిలిపెట్టవు. అలాగే చీల్చి.. చెందాడుతాయి.. కొన్నిసార్లు చంపేస్తాయి కూడా.. అయితే ఈ కుక్కలు కేవలం మనుషుల మీద మాత్రమే కాదు.. చిరుతపులి లాంటి జంతువులపై కూడా దాడులు చేస్తాయి. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది.

    జైపూర్లో ఘటన..

    రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి పిట్ బుల్ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క ఆ ఇంటికి కాపలాగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని కూడా ఆ కుక్క గురించి తెలిసి హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇటీవల ఓ చిరుత పులి అటువైపుగా వచ్చింది. ఆ ఇంట్లోకి ప్రవేశించింది. కుక్కపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అడుగులో అడుగు వేసుకుంటూ కుక్కవైపు వెళ్ళింది. దీంతో పిట్ బుల్ బిగ్గరగా అరుస్తూ చిరుతపులి పై దాడి చేసింది. దానిని పదేపదే కరవడానికి ప్రయత్నించింది. ఫలితంగా ఆ చిరుత పులి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది. అయితే ఈ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు కావడంతో.. ఆ ఇంటి యజమాని మురిసిపోతున్నాడు. ” కుక్క ఎదురుదాడికి దిగింది . ఏకంగా చిరుతపులిని పరుగులు పెట్టించింది. పిట్ బుల్ పవర్ ముందు చిరుత పులి కూడా తలవంచింది. విశ్వాసానికి ఈ కుక్క మారుపేరు. దానిని మరొకసారి సార్ధకం చేసుకుంది. ఈ దృశ్యాలు చూసిన తర్వాత ఆ కుక్కపై గౌరవం పెరిగిపోయిందని” ఆ యజమాని పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అనేకమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “ఆ యజమాని అదృష్టవంతుడు..ఆ పిట్ బుల్ చూడ్డానికి మామూలుగా ఉన్నప్పటికీ.. అత్యంత బలంగా ఎదురుదాడి చేసింది. చిరుత పులిని చంపడానికి ప్రయత్నించింది. చూసేందుకు ఈ దృశ్యం భయానకంగా ఉన్నప్పటికీ.. ఆ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించి కుటుంబాన్ని కాపాడటం గొప్పగా అనిపించిందని” వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, పిట్ బుల్ జాతి కుక్కలు వైల్డ్ గా ఉంటాయి. ఎంతటి జంతువైనా సరే ఎదురు దాడికి దిగుతాయి. ఏ మాత్రం భయపడకుండా కరుస్తాయి. వాటికి గనక తిక్క రేగితే చంపడానికి కూడా వెనుకాడవు.