https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్…

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ... ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : November 20, 2024 / 11:52 AM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అలాగే యూత్ ను బేస్ చేసుకొని ఆయన చేసే సినిమాలు కూడా ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోలందరిలో విజయ్ కి చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు…

    అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఈయన చేసిన రెండు మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవ్వడంతో ఇప్పుడు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగానే ఆయన చేయబోయే సినిమాలు కూడా చాలా మంచి గుర్తింపును సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దాదాపు ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతోపాటుగా ప్రస్తుతం ఆయన మరొక స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అతను ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గా తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాని కంప్లీట్ చేసి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికి తను మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు.

    అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికి వాటి మీద ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయితే కనక ఇటు విజయ్ దేవరకొండ కి, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇద్దరికి హెల్ప్ అవుతుందనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియాలో ఇద్దరు కూడా మంచి ఇమేజ్ ని దక్కించుకుంటారు. మరి ఈ సినిమా మీద క్లారిటీ రావాలంటే అటు విజయ్ దేవరకొండ గాని, ఇటు త్రివిక్రమ్ గాని ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…

    ఇక ఇప్పటికే వీళ్ళు చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ అయితే సాధించుకున్నాయి. మరి దాని వల్లే వాళ్ల సినిమాలకి ఇప్పుడు డిమాండ్ అయితే పెరుగుతుంది… చూడాలి మరి రాబోయే సినిమాలతో వీళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…