NTR- Pawan Kalyan: షాకింగ్ ట్విస్ట్… పవన్ కళ్యాణ్ బిరుదును వాడేసుకుంటున్న ఎన్టీఆర్!

NTR- Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ బిరుదును ఎన్టీఆర్ మూవీ టైటిల్ గా ఫిక్స్ చేస్తున్నారట. విషయంలోకి వెళితే… ఎన్టీఆర్ 30 కొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. మార్చి మూడో వారంలో రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్శకుడు కొరటాల శివ విన్నూతమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. సామాజిక కోణం కూడా టచ్ చేస్తున్నారట. కథతో సముద్ర తీరం, పోర్ట్ నేపథ్యం బలంగా ముడిపడి […]

Written By: Shiva, Updated On : March 8, 2023 9:38 am
Follow us on

NTR- Pawan Kalyan

NTR- Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ బిరుదును ఎన్టీఆర్ మూవీ టైటిల్ గా ఫిక్స్ చేస్తున్నారట. విషయంలోకి వెళితే… ఎన్టీఆర్ 30 కొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. మార్చి మూడో వారంలో రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్శకుడు కొరటాల శివ విన్నూతమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. సామాజిక కోణం కూడా టచ్ చేస్తున్నారట. కథతో సముద్ర తీరం, పోర్ట్ నేపథ్యం బలంగా ముడిపడి ఉంటాయని సమాచారం.

ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. జాన్వీ పుట్టినరోజు పురస్కరించుకొని ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. సముద్ర తీరాన లంగా ఓణీలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న జాన్వీ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ టైం శ్రీదేవి కూతురు సౌత్ ఇండియన్ మూవీ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ 30 మరింత ప్రత్యేకత చాటుకుంది. ఎప్పటి నుండో జాన్వీని తెలుగులో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఎట్టకేలకు సాకారం అయ్యాయి. ఇక జాన్వీకి కూడా ఈ మూవీ చాలా స్పెషల్. కెరీర్లో మొదటిసారి ఆమె ఒక టాప్ హీరో సరసన నటిస్తున్నారు.

కాగా ఈ చిత్ర టైటిల్ గా దేవర అనుకుంటున్నారట. టాలీవుడ్ లో వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా… అందరినీ ఈ టైటిల్ ఆకర్షించింది. కారణం దేవర పవన్ కళ్యాణ్ బిరుదుగా ఉంది. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ దేవర అని పిలుచుకుంటారు .బండ్ల గణేష్ అయితే తరచుగా వాడుతుంటారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడనే పుకారు ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ 30 టైటిల్ దేవర అన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

NTR- Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న వినోదయ సితం రీమేక్ కి కూడా దేవర టైటిల్ పరిశీలించారు. భగవంతుడు, దేవుడు, దేవర అనే మూడు టైటిల్స్ లో దేవుడు టైటిల్ కి మొగ్గు చూపారట. ఒక ఎన్టీఆర్ 30 టైటిల్ దేవర అనే వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఎన్టీఆర్ 30 సమ్మర్ కానుకగా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Tags