CM Vijay: దళపతి విజయ్.. సినిమా హీరోగా సౌత్ ఇండియా ప్రజలకు సుపరిచితం. తన అవినీతి, అక్రమాలు, రౌడీయిజంపై పోరాడే అనేక సినిమాల్లో నటించారు. పోలీస్ ఆఫీజర్లుగా పొలిటికల్ రౌడీల భరతం పట్టారు. కోట్ల మంది అభిమానులు ఉన్న దళపతి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. వివిధ పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. విజయ్ సీఎం అయ్యారు. రెండు నెలల్లో పాలనలోనపూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. ఎవరైనా లంచం అడిగితే ఇవ్వవద్దని, తమ చట్టబద్ధమైన పనులు జరిగేలా తాను చూస్తానని స్పష్టం చేశారు.
నేనున్నానంటూ ధీమా..
సీఎం విజయ్ చెప్పిన మాటలు ప్రజలకు ధీమా కల్పించడంతోపాటు అవినీతి అధికారులకు ఒక హెచ్చరిక. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి చేసే ప్రయత్నం. లంచం అడిగే వారికి ప్రజలు ‘‘లేదు’’ అని చెప్పడం ద్వారా అవినీతి చక్రం ఆగిపోతుందని ఆయన అభిప్రాయం. అలాగే, పనులు ఆపడానికి ఎవరు ప్రయత్నించినా వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పడం ద్వారా ప్రభుత్వ నాయకత్వం బలంగా నిలబడుతుందని సూచిస్తున్నారు.
ప్రజల హక్కులను కాపాడేలా..
ఈ సందేశం ప్రజలను కేవలం బాధితులుగా చూడకుండా లంచం ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా ప్రజలు తమ హక్కులను కాపాడుకోవచ్చు. అయితే ఇది సులభం కాదు. చాలా మంది భయపడి లేదా పని త్వరగా పూర్తి చేయాలని లంచం ఇచ్చేస్తారు. సీఎం విజయ్ ఇలా చెప్పడం ద్వారా ప్రజలకు ధైర్యం కలిగించి, వారి బాధ్యతను కూడా నొక్కి చెప్పారు.
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతకు..
తమిళనాడు సీఎం విజయ్ ప్రకటన ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి అంశాలపై నేరుగా దాడి చేస్తుంది. లంచం అడిగే అధికారులు లేదా మధ్యవర్తులు ఈ సందేశం విన్న తర్వాత ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. పనులు ఆపకుండా ముందుకు తీసుకెళ్లేలా చూడాలని సీఎం చెప్పడం వల్ల దిగువ స్థాయి అధికారులు మరింత జాగ్రత్తగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మాటలతో మాత్రమే సాధ్యం కాదు. వాస్తవికంగా అమలు జరగాలి.
ఈ సందేశం ఎఫెక్ట్..
సీఎం విజయ్ ఇచ్చిన ఈ సందేశం అవినీతి నిరోధం దిశగా ఒక మంచి ప్రారంభం. ఇది ప్రజలలో అవగాహన పెంచి, ప్రభుత్వంపై నమ్మకం పెంచే అవకాశం ఉంది. అయితే వాస్తవంలో అమలు చేయడం సులభం కాదు. లంచం అడిగిన వారిపై చర్యలు తీసుకోవడం, పనులు ఆలస్యం కాకుండా చూడడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం వంటి వ్యవస్థాగత మార్పులు అవసరం. ఈ సందేశం కేవలం ప్రచారానికి మాత్రమే మిగిలిపోతే, ప్రజలలో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు, నిజంగా అమలు జరిగితే అది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారవచ్చు. అవినీతి నిరోధం మాటలతో కాకుండా, ప్రజల సహకారం, వ్యవస్థాగత సంస్కరణలతోనే సాధ్యమవుతుంది. సీఎం విజయ్ ఇచ్చిన ఈ సవాల్ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.
