Kalyan Ram Love Story: ఆ స్టార్ హీరోయిన్ తో కళ్యాణ్ రామ్ లవ్ ఆపై బ్రేకప్… వారి పెళ్లిని అడ్డుకుంది ఎవరు?

Kalyan Ram Love Story: మనసు మాట వినదు. నచ్చిన వ్యక్తి కనిపిస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. కలిసి జర్నీ చేయాలనే ఆశ కలిగిస్తుంది. ప్రేమకు ఎవరూ అతీతం కాదు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. కాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి కూడా పెద్ద లవ్ స్టోరీ ఉందట. ఆయన పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో పడ్డారట. ఆమె కూడా కళ్యాణ్ రామ్ ని […]

Written By: Shiva, Updated On : March 8, 2023 9:46 am
Follow us on

Kalyan Ram Love Story

Kalyan Ram Love Story: మనసు మాట వినదు. నచ్చిన వ్యక్తి కనిపిస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. కలిసి జర్నీ చేయాలనే ఆశ కలిగిస్తుంది. ప్రేమకు ఎవరూ అతీతం కాదు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. కాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి కూడా పెద్ద లవ్ స్టోరీ ఉందట. ఆయన పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో పడ్డారట. ఆమె కూడా కళ్యాణ్ రామ్ ని విపరీతంగా ప్రేమించిందట. పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

అయితే కళ్యాణ్ రామ్ ప్రేమకు తండ్రి హరికృష్ణ అడ్డుపడ్డారట. సదరు హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారట. దాంతో చేసేది లేక నందమూరి కళ్యాణ్ రామ్ తన ప్రేమను చంపుకున్నారట. ఆ హీరోయిన్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు. ఆమెకు కూడా పెళ్లైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ హీరోయిన్ ని కళ్యాణ్ రామ్ ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో అని భయపడిన హరికృష్ణ తమ కమ్యూనిటీలో అందమైన ఒక అమ్మాయిని చూసి వివాహం చేశారు.

కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి కాగా వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. 2006లో కళ్యాణ్ రామ్-స్వాతిల వివాహం ఘనంగా జరిగింది. అలా కళ్యాణ్ రామ్ ప్రేమలో ఫెయిలై… పెద్దలు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ పరిశీలిస్తే ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. ఆయన గత ఏడాది బింబిసార రూపంలో భారీ హిట్ కొట్టారు. కళ్యాణ్ రామ్ కి బింబిసార అపూర్వమైన విజయాన్ని ఇచ్చింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార ప్రేక్షకులను అలరించింది.

Kalyan Ram

అయితే అమిగోస్ మూవీతో కళ్యాణ్ రామ్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఒక్క హిట్ ఇస్తే అరడజను ప్లాప్స్ ఇస్తాడు. విజయాల్లో నిలకడ లేకపోవడం వలన కళ్యాణ్ రామ్ స్థిరమైన మార్కెట్, స్టార్డమ్ అందుకోలేకపోతున్నారు. నందమూరి ఫ్యామిలీ అండ ఉండి కూడా రేసులో వెనుకబడుతున్నాడు. ప్రస్తుతం డెవిల్ టైటిల్ తో స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది కూడా ప్రయోగాత్మక చిత్రం అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ లుక్ సరికొత్తగా ఉంది. ప్రోమోలు అలరిస్తుండగా… డెవిల్ కళ్యాణ్ రామ్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Tags