https://oktelugu.com/

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలనం : కల్వకుంట్ల కవిత అరెస్ట్ తప్పదా?

Kalvakuntla Kavitha : అనుకున్నట్టే అయ్యింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెకు ఈడీ నోటీసు జారీ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అనంతరం కవితకు అత్యంత సన్నిహితుడైన రామచంద్రపిళ్లైను ఇటీవల అరెస్ట్ చేశారు. పిళ్లై కవిత బినామీ అన్నట్టుగా ఈడీ సీబీఐలు కోర్టులో వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా కవితను విచారణకు పిలుస్తుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2023 9:22 am
    Follow us on

    Kalvakuntla Kavitha : అనుకున్నట్టే అయ్యింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెకు ఈడీ నోటీసు జారీ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అనంతరం కవితకు అత్యంత సన్నిహితుడైన రామచంద్రపిళ్లైను ఇటీవల అరెస్ట్ చేశారు. పిళ్లై కవిత బినామీ అన్నట్టుగా ఈడీ సీబీఐలు కోర్టులో వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా కవితను విచారణకు పిలుస్తుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.

    హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏజెన్సీ అధికారులు అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఇది జరగడం సంచలనంగా మారింది.

    మంగళవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో భారీ కిక్‌బ్యాక్‌ల చెల్లింపులు.. సౌత్ గ్రూప్‌కు చెందిన అతిపెద్ద కార్టెల్ ఏర్పాటుకు సంబంధించిన మొత్తం స్కామ్‌లో పిళ్లై కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొంది.

    ఇప్పుడు పిళ్లై అరెస్ట్ తర్వాత కవితనే అన్న ఊహాగానాలు మీడియాలో జోరుగా సాగుతున్నాయి. సిసోడియాను కూడా ఇలానే విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కవిత పరిస్థితి అలాంటిదేనని అంటున్నారు.