Homeకరోనా వైరస్దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదట!

దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదట!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ తగ్గుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూ కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్న ఎయిమ్స్ వైద్యులు జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు.

అయితే ఇదే సమయంలో కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని వాళ్లు వెల్లడించారు. వచ్చే సంవత్సరం ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు.

ఇందుకోసం మెక్ గిల్ పరిశోధకులు అధ్యయనం కూడా నిర్వహించారు. 2021 నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని అమెరికా చెబుతోందని కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో జరిగే పరీక్షల్లో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అందువల్లే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి లేట్ అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమే అని వస్తున్న వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తూ ఉండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version