
ఏపీ సీఎం జగన్ వేట మొదలుపెట్టారు. తనకు వ్యతిరేకంగా టీడీపీ తరుఫున బలంగా వాయిస్ వినిపించిన వారిని ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఇప్పటికే జైలుకు పంపిన జగన్.. ఇప్పుడు అదే టీడీపీలో వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ మీడియాల్లో బలంగా వాదన వినిపించే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరిని టార్గెట్ చేశారు.
Also Read: చంద్రబాబు జోస్యం: 2022లో జమిలీ ఎన్నికలట..?
తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరికి వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖలోని సబ్బం హరికి చెందిన ఇంటికి ఆనుకొని ఉన్న గదిని అక్రమ కట్టడమని జీవీఎంసీ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సబ్బం హరితోపాటు విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పెందుర్తిలో ఉన్న ప్రహరి గోడ ఆక్రమణ పేరుతో కూల్చివేతకు సిద్ధమయ్యారు. ప్రహరి కూల్చివేతకు రెవెన్యూ సిబ్బంది గురువారం రాత్రి ఎక్స్ కావేటర్ తో అక్కడికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అధికారులు రాకపోవడంతో వెనుదిరిగారు.రెవెన్యూ అధికారులు, సిబ్బంది గురువారం గోడపై మార్కింగ్ చేయడం.. కక్షసాధింపులో భాగమేనని మండిపడ్డారు.
ఇక తన గది కూల్చివేతపై సబ్బం హరి నిప్పులు చెరిగారు. అక్రమ కట్టడమా? అయితే పేపర్లు చూపిస్తే ఓ గంటలో తానే ఆ రూమ్ ను కూల్చివేస్తానని చెప్పినా.. అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో పక్కింటివారు నిద్రలేపేసరికే కూల్చివేస్తారా అని జీవీఎంసీ అధికారులను ప్రశ్నించారు.
Also Read: జగన్ ఆ వ్యాధితో బాధ పడుతున్నారన్న చినబాబు..?
ముందుగా సమాచారం ఇవ్వకుండా.. వేకువజాము సమీపంలో జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేతలపై సమాధానం ఇవ్వడానికి జీవీఎంసీ అధికారులు నిరాకరించారు.
ఇలా వైసీపీకి వ్యతిరేకంగా గళమెత్తిన.. కామెంట్స్ చేసిన వారిని వైసీపీ సర్కార్ వేటాడుతోంది. వారి ఆస్తులు.. అనుయాయులను టార్గెట్ గా ముందుకెళుతోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందనేది వేచిచూడాలి.