Harsha Sai: హర్షసాయి చేసింది మంచేనా? చెడా?

సడన్ గా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు.. హర్షసాయి హర్షసాయి హర్షసాయి అంటూ మారుమోగాయి. ఈయన సహాయం చేసే వీడియోలను చూసి ప్రజలు దేవుడిగా చూశారు. మంచి వ్యక్తిగా కొనియాడారు.

Written By: Chai Muchhata, Updated On : June 30, 2024 4:32 pm

Harsha Sai

Follow us on

Harsha Sai: హర్షసాయి.. పేదవారికి ఒక దేవుడు, ఆపదంటే ఆప్తుడు అవుతాడు, భయానికి నమ్మకం అంటూ ఎంతో మంది దేవుడిలా చూశారు ఈయనను. కానీ ప్రస్తుతం కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ దిశ దివ్యాంగ్ సురక్ష బ్రాండ్ అంబాసిడర్. ఎవరైన ఆపదలో ఉన్నారని ఆయనకు తెలిస్తే ఓ సూట్ కేస్ తీసుకెళ్లి రెండు ప్రశ్నలు అడిగి ఇందులో ఉన్న మనీ మీదే అంటూ పంచేస్తాడు. వారి కోరికలు కనుక్కొని మరీ తీరుస్తాడు హర్షసాయి. కానీ ఇలా సహాయం చేయడానికి కూడా కారణం ఉందని.. ఆయన మోసం చేశాడు అంటున్నారు కొందరు. ఇంతకీ ఏం జరిగిందంటే.

సడన్ గా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు.. హర్షసాయి హర్షసాయి హర్షసాయి అంటూ మారుమోగాయి. ఈయన సహాయం చేసే వీడియోలను చూసి ప్రజలు దేవుడిగా చూశారు. మంచి వ్యక్తిగా కొనియాడారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు తిడుతున్నారు. సడన్ గా దేవుడిగా చూసి ప్రస్తుతం తిడుతున్నారంటే కారణం కూడా లేకపోలేదట. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బు ద్వారా మాత్రమే హర్షసాయి సహాయం చేశారని సమాచారం. దీన్ని ప్రశ్నిస్తే ఆయన సమాధానాలు విని మరింత షాక్ అవుతున్నారు సాయి అభిమానులు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మాట నిజమే అని.. కానీ అతను ప్రమోట్ చేయకపోతేనే తప్పు చేసినట్టు అని తెలిపారు హర్షసాయి. తన వరకు వచ్చిన బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఇతరుల వరకు వెళ్లకూడదని ఆయన ఒకే చేశారట. ఇతరులు అయితే ఎలాంటి జాగ్రత్తలు చెప్పకుండా ప్రమోట్ చేస్తారని..తను మాత్రం జాగ్రత్తలు చెబుతూ ప్రమోట్ చేస్తున్నాను అంటున్నారు హర్షసాయి. అంతేకాదు అందులో వచ్చిన డబ్బుల్లో కొంత పేదలు సహాయం చేశామని..మంచి పనులు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించాము అంటున్నాడు. ఆయన యాంగిల్ ఎలా ఉన్నా..సాయి మీద కోపంతో ఉన్నవారే ఎక్కువ ఉన్నారు. మరి దీనికి కూడా కారణం లేకపోలేదు.

పేదవారికి సహాయం చేసేవారు మోసం చేయరు అంటారు. అలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు సాయి. ఈయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు నమ్ముతారు. డబ్బులు సంపాదించడం గురించి ఆయన చెబుతుంటే నిజమే అని నమ్మి చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో కూరుకొని పోయారట. ఈయన మాటే శాసనం అని నమ్మేవారు లక్షలు కూడా డబ్బును కోల్పోయారట. ఈయన చేసిన ప్రమోషన్ వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారని.. దీనికి కారణం హర్ష సాయి అంటూ కొందరు మండిపడుతున్నారు. ఇక దీన్ని హర్ష సాయి ఎలా ఎదుర్కొంటారో? ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.