India Vs South Africa Final: టీమిండియా వరల్డ్ కప్ నెగ్గింది ధోని కోసమేనా.. నెట్టింట ఆసక్తికర చర్చ..

భారత జట్టు అపూర్వమైన విజయం సాధించిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ఉద్వేగానికి గురయ్యాడు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 4:38 pm

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: 2007లో ధోని నాయకత్వంలో.. టి20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్ లో టీమిండియా విజయం సాధించింది.. ఆ తర్వాత 2014లో ఫైనల్ వెళ్ళింది. దురదృష్టవశాత్తు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2022లో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. ఇక 2024 లో వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజేతగా ఆవిర్భవించింది. శనివారం వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 34 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో.. జట్టు భారాన్ని మొత్తం విరాట్ మోసాడు. ఏకంగా 76 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్ కు పటిష్ట పునాది వేశాడు. రోహిత్ శర్మ సెమీ ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత చెప్పిన మాటలను విరాట్ నిజం చేశాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. ప్రధాన నుంచి సచిన్ టెండుల్కర్ దాకా ప్రతి ఒక్కరూ టీమిండియా కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీమిండియా కు తొలి టి20 వరల్డ్ కప్ అందించిన ధోని.. విభిన్నంగా రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపాడు.

భారత జట్టు అపూర్వమైన విజయం సాధించిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ఉద్వేగానికి గురయ్యాడు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. “మ్యాచ్ జరుగుతున్నంత సేపు నా హృదయ స్పందన పెరిగిపోయింది. నిశబ్దాన్ని పాటిస్తూనే అద్భుతమైన విజయాన్ని సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతి ఒక్క ఆటగాడి పై నమ్మకం ఉంచి.. అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు. వెస్టిండీస్ నుంచి సగర్వంగా టి20 వరల్డ్ కప్ ను స్వదేశానికి తీసుకొస్తున్నందున ప్రతీ భారతీయుడు విజయ గర్వాన్ని ప్రదర్శిస్తాడు. కంగ్రాట్స్ బాయ్స్.. నా పుట్టినరోజుకు ముందే వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు. మీ అందరికీ నా ధన్యవాదాలు” అంటూ ధోని రాసుకొచ్చాడు. జూలై 7 న మహేంద్ర సింగ్ ధోని జన్మదినం. దానిని ప్రస్తావిస్తూ అలా అతడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టడానికి కారణమని అభిమానులు అంటున్నారు.. మరోవైపు దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎందుకంటే ఇది కూడా ” తలా” కు ప్రత్యేకమే. ఇందుకు కారణం లేకపోలేదు.. ధోని జెర్సీ నెంబర్ కూడా ఏడే కాబట్టి..

2007లో ప్రారంభ ఎడిషన్ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుతో తలపడింది. ఉత్కంఠ మధ్య ఆ జట్టుపై విజయం సాధించింది. తొలిసారి టి20 వరల్డ్ కప్ అందుకుంది. అప్పుడు టీమ్ ఇండియాకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. చివరి ఓవర్లో జోగిందర్ శర్మతో బౌలింగ్ వేయించి అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు. ఇక శనివారం జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించి.. దక్షిణాఫ్రికా జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. మొత్తానికి అప్పుడు ధోని, ఇప్పుడు రోహిత్ తమదైన నాయకత్వ ప్రతిభతో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించారు.