Shocking Marriage: ‘పెళ్లంటే నూరేళ్ల పంట’లా భావిస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతిపెద్ద వేడుక ఇదే కావడంతో కలకాలం గుర్తుండిపోయేలా.. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే వేడుకను ఆడంబరంగా జరుపుకునేందుకు బంధువులు, స్నేహితులను పిలుస్తారు. పెళ్లిళ్లల్లో బంధువుల కన్నా స్నేహితుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇంతకాలం తమతో చదువుకుంటూ.. కలిలిమెలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒకరి భాగస్వామ్యం కావడంతో ఇక కలిసేది తక్కేవేనని భావిస్తారు. ఈ సందర్భంగా పెళ్లిలో తమ స్నేహితులు ఆటపట్టిస్తారు. అయితే నేటి కాలంలో ఇవి హద్దు మీరుతున్నాయి. ఒక్కోసారి ఇలా ఆటపట్టిద్దామని అనుకుంటుండగా.. అవి వివాదంగా మారుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో స్నేహితులు చేసిన హడావుడికి వరుడి మొహం మాడిపోయింది. దీంతో ఆ స్నేహితులు కాస్త నిరాశ చెందారు. ఇంతకీ పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన పనేంటి? ఎందుకు వరుడి మోహం మాడిపోయింది? ఇంతకీ పెళ్లి కూతురు ఏం చేసింది? ఆ వివరాల్లోకి వెళితే..
‘అరె.. పెళ్లంటేనే మజాకా.. ఈ ఈవెంట్ లో అందరూ సంతోషంగా ఉండాలి..’ అనే ‘బాద్ షా’ డైలాగ్ అందరినీ ఆకర్షిస్తుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి వేడుకలో చాలా వరకు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఎక్కోడ చోట చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఇవి మజాక్ చేయడానికి చేసినవే అయినా ఎదుటి వారికి నచ్చని విధంగా ఉంటాయి. కొందరు వీటినిఓర్చుకోలేక ఆగ్రహానికి గురవుతాయి. అలాగే వరుడి స్నేహితులు పెళ్లి స్టేజిపై ఓ పని చేశారు. వీరు చేసిన పనికి వధువు సంతోషంగా ఉంది. కానీ వరుడు మాత్రం నిరాశతో ఉన్నాడు.
సాధారణంగా ఏ పెళ్లికి వెళ్లినా వారిని దగ్గరికి వెళ్లి ఆశీర్వదించి వస్తారు. ఈ సందర్భంగా క్యూ ఉంటే వెయిట్ చేసి మరీ పెళ్లి మండపం ఎక్కుతారు. అందరిలాగే పెళ్లికొడుకు స్నేహితులు పెళ్లి వేదికపైకి ఎక్కారు. అయితే ఇంతలో బ్యాక్రౌండ్ లో ఓ సాంగ్ ప్లే అవుతోంది. ఈ సాంగ్ కు అనుగుణంగా డ్యాన్స్ చేయాలని వరుడిని కోరారు. ఇదే క్రమంలో వధువుని కూడా నృత్యం చేయమని కోరారు. అయితే వరుడు ఏ విధంగా స్పందించలేదు. కానీ వధువు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా చేతులు అటూ ఇటూ తిప్పుతూ డ్యాన్స్ చేయసాగింది. వారితో వరుడి స్నేహితులు కూడా డ్యాన్స్ చేశారు. కానీ వరుడు మాత్రం పెళ్లికూతురు చేసే డ్యాన్స్ ను చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే వెనక్కి వెళుతూ సిగ్గుపడుతూ ఉండిపోయాడు. వరుడిని డ్యాన్స్ చేయాలని స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతని మోహం మాడిపోయింది. ఆ తరువాత పెళ్లి కూతురుకు సీన్ అర్థమయి తాను కూడా డ్యాన్స్ చేయడం మానుకుంది.
దేబాసిష్ స్వైన్ అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది. నేటి కాలంలో పెళ్లి వేడుకలో ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటున్నాయి. ఇదే తరహాలో తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోపై కొందరు ఆసక్తి కరంగా కామెంట్ చేస్తున్నారు.