https://oktelugu.com/

Vishnu : మోహన్ బాబు, మనోజ్ ల గొడవ మీద స్పందించిన విష్ణు…ఇద్దరిలో తప్పు ఎవరిదో చెప్పేశాడుగా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది న వాళ్ల నట విశ్వరూపాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 02:34 PM IST

    Vishnu

    Follow us on

    Vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది న వాళ్ల నట విశ్వరూపాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ దైన రీతులో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్ళు స్టార్ హీరో రేంజ్ లో సక్సెస్ లైతే రావడం లేదు… ఇక దానికి తోడు గా వీళ్ళు తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు…

    రీసెంట్ గా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే వీళ్లకు తరచుగా గొడవలు జరుగుతున్నాయనే వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇవాళ మార్నింగ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన మంచు విష్ణు వాళ్ల నాన్న అయిన మోహన్ బాబు తమ్ముడు మంచి మనోజ్ కి మధ్య జరిగిన గొడవలను తెలుసుకొని మీడియాతో మాట్లాడాడు. ఇక ఎవరి ఇంట్లో అయినా ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. వాటిని పెద్దది చేసి చూపించే ప్రయత్నం చేయకండి ఈ గొడవలన్నింటికి మేము ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం అంటూ ఆయన మాట్లాడిన తీరు యావత్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. నిజానికి ఈయన ఇండియాలో లేని సమయంలో ఇక్కడ గొడవలు అయితే జరిగాయి. మరి మంచు విష్ణు ఉంటే ఇలా జరిగేది కాదని కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది మాత్రం మంచు విష్ణు వల్లే ఇలా జరిగింది అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వాళ్ల తమ్ముడితోపాటు నాన్నని కూడా కలిసి వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. వీటికి ఎక్కడ పులిస్టాప్ పెట్టాలనే దిశగా మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా ఇలా ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చి వాళ్ల పరువు తీసుకోవడం అనేది సరైనది కాదు. మరి ఈ విషయంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే మంచు ఫ్యామిలీ ని గత కొద్దిరోజుల నుంచి చాలామంది ట్రోల్ చేస్తూ వస్తున్నారు.

    ఇక ఇంతలోకే వీళ్ళు గొడవ పెట్టుకోవడం అనేది ఇప్పుడు మంచు ఫ్యామిలీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు కూడా కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తుందనే చెప్పాలి… మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని సామరస్యంగా పరిష్కరిస్తాడా లేదంటే తను కూడా వాళ్లతో పాటు గొడవకు దిగుతాడా అనే విషయాల మీద సరైన క్లారిటీ ఏది రావాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమాతో తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నప్పటికి తన కుటుంబంలో జరుగుతున్న వివాదాలను పరిష్కరించడానికి తను దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది…