https://oktelugu.com/

Pregnant Woman: ప్రసవం కోసం సెలవు పెట్టింది.. పూర్తయి ఆఫీస్ కొచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్పింది.. మహిళను తీసేసిన కంపెనీ..వైరల్ వీడియో

ఒక మహిళ ఉద్యోగి గర్భం దాల్చితే.. ఆమె పనిచేస్తున్న కంపెనీ ప్రసూతి సెలవులు మంజూరు చేస్తుంది. లేబర్ యాక్ట్ ప్రకారం ఆమె సెలవులో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వేతనం ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల కైతే ఈ సెలవులు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు కాస్త తక్కువగా ఉంటాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 11, 2024 / 05:51 PM IST
    Pregnant Woman

    Pregnant Woman

    Follow us on

    Pregnant Woman: కార్పొరేట్ విభాగంలో పనిచేసే మహిళ ఉద్యోగులకు చెల్లింపులు లేబర్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి. ఇక విదేశాలలో ఈ చట్టాల అమలు మరింత పటిష్టంగా ఉంటుంది. గర్భం దాల్చి.. ప్రసవం కోసం సెలవులు పెట్టుకునే మహిళలకు.. అన్ని రోజుల వేతనంతో పాటు.. ప్రసూతి కోసం అయ్యే ఆసుపత్రి ఖర్చులు కూడా కంపెనీలు భరిస్తాయి. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీలపై అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని.. ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి గర్బంధాల్చింది. ప్రసవం సమయం రావడంతో ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆ కంపెనీ ఆమెకు సెలవులు మంజూరు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఆఫీస్ కు వచ్చింది. ఇదే సమయంలో తాను రెండవసారి గర్భం దాల్చానని చెప్పేసింది. దీంతో ఆ కంపెనీ అధికారులకు షాక్ తగిలినంత పనైంది. దీంతో వారు రెండో మాటకు తావు లేకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మీమర్స్ ఒక వీడియోను రూపొందించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

    నెటిజన్లు ఏమంటున్నారంటే

    ప్రసవం కోసం సెలవు అడిగిన మహిళ.. రెండవసారి గర్భం దాల్చానని చెప్పడం.. దానికోసం మళ్లీ సెలవు అడగడం నెటిజన్లకు కూడా షాక్ కలిగించే పరిణామం లాగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ” కంపెనీ సరైన నిర్ణయం తీసుకుందని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని” ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ” ఈరోజుల్లో గర్భం దాల్చడం.. ప్రసూతికి సంబంధించి సెలవులు అడగడం ఆడవాళ్లకు ఒక ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇది సరైన విధానం కాదు. వాస్తవంగా ఆమె మొదటిసారి గర్భం దాల్చిందా? నిజంగానే ప్రసవం జరిగిందా? అయితే ఇంత తక్కువ సమయంలో మళ్లీ రెండవసారి గర్భం ఎలా దాల్చుతుందని” ఒక మహిళ ప్రశ్నించింది..” ప్రసూతి సెలవులు అంటే ఎంజాయ్మెంట్ కాదని.. అది విశ్రాంతి తీసుకునే సమయం అని.. అలాంటప్పుడు మహిళలకు సెలవులు ఇవ్వాల్సిందేనని” ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ” కంపెనీ పకడ్బందీ నిర్ణయం తీసుకుంది. ఇలాంటప్పుడు అలాంటి చర్యలే తీసుకోవాలి. లేకుంటే కంపెనీ మునిగిపోతుందని” ఓ యువకుడు వ్యాఖ్యానించాడు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. సోషల్ మీడియాను మాత్రం ఊపేస్తోంది. ఇలాంటి ఉదంతాలు కంపెనీలకు నష్టం కలిగిస్తాయని.. మొదటిసారి ప్రసూతి సెలవుల కోసం చెల్లింపు సేవలు మంజూరు చేసిన కంపెనీలు.. రెండోసారి గర్భం దాల్చానని చెబితే ఉద్యోగం నుంచి తొలగిస్తాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.