Pushpa 2: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై కేవలం అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు, టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు కాసేపటి క్రితమే మేకర్స్ ఒక తీపి కబురు వినిపించారు. ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేస్తూ మేకర్స్ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నా లో జరగబోతుంది.
ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడని సోషల్ మీడియా లో ఒక టాక్ ఉంది కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆయన ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయట. ఎందుకంటే అమీర్ ఖాన్ కి అల్లు ఫ్యామిలీ తో మంచి సాన్నిహిత్యం ఉంది. బాలీవుడ్ లో అల్లు అరవింద్, అమీర్ ఖాన్ ని పెట్టి ‘గజినీ’ చిత్రం రీమేక్ చేసాడు. అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సంచలనం. అంతే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల చిత్రం ఇదే. అప్పటి నుండి అల్లు ఫ్యామిలీ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ‘పుష్ప 2’ అల్లు అర్జున్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా కాబట్టి, మేకర్స్ అడగగానే షెడ్యూల్ చూసుకొని చెప్తానని తెలిపాడట అమీర్ ఖాన్. ఒకవేళ ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమాని ప్రమోట్ చేస్తే బాలీవుడ్ లో ‘పుష్ప 2’ మరింత హైప్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసారు. ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి ఆడిపాడింది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని సినిమా విడుదలకు వారం రోజుల ముందు విడుదల చేస్తారట. ‘పుష్ప1’ కి కూడా అదే తరహా ప్యాట్రన్ ని అనుసరించారు మేకర్స్. ఇది ఇలా ఉండగా నార్త్ అమెరికా లో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై పది రోజులు కావొస్తుంది. కానీ బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు. ట్రైలర్ మీదనే ఆధారపడి ఉంది. థియేట్రికల్ ట్రైలర్ బాగుంటే కచ్చితంగా నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయంలో ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశం ఉంది.