https://oktelugu.com/

Sunita Williams : సునీత “బరువు” బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్న నాసా.. ఏం నిర్ణయం తీసుకుందంటే?

ఈ ఏడాది జూన్ ఐదున ఎనిమిది రోజుల మిషన్ నిమిత్తం భారతీయ మూలాలు ఉన్న వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షానికి వెళ్లారు. బోయింగ్ సంస్థకు సంబంధించిన స్టార్ లైనర్ లో వారు ప్రయాణించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2024 / 06:24 PM IST

    Sunita Williams

    Follow us on

    Sunita Williams : సునీత, విల్మోర్ తిరిగి భూమ్మీద కు వచ్చే క్రమంలో స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. కొద్ది రోజులుగా వారు భూమ్మీద కు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వారు అప్పుడప్పుడు అంతరిక్షం నుంచే మాట్లాడుతున్నారు. ఇటీవల వారు అనేక అంశాలపై మాట్లాడారు. అమెరికా ఎన్నికలపై కూడా స్పందించారు.. అయితే అంతరిక్షం నుంచి సునీత మాట్లాడుతున్నప్పుడు ఆమె బలహీనంగా కనిపించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అందరిలో ఆందోళన మొదలైంది. సునీత పూర్తిగా బలహీనంగా మారిపోవడంతో.. ఆమెకు ఏదైనా జరుగుతోందా? అనే కోణంలో పాశ్చాత్య మీడియా నుంచి మొదలు పెడితే దేశీయ మీడియా వరకు కథనాలను ప్రసారం చేశాయి. దీంతో సునీత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా నాసా స్పందించింది. ” సునీత ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమెతో పాటు ఉన్న వ్యోమగామి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వారికి ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని” నాసా వెల్లడించింది. సునీత ఆరోగ్యం పై అమెరికాకు చెందిన పోషకాహార నిపుణులు కూడా స్పందించారు. ఆమె అంతరిక్షంలో ఉండడంవల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. అందువల్లే బలహీనంగా మారారని అభిప్రాయపడ్డారు. సునీత, విల్ మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లో భూమ్మీదకి వస్తారని తెలుస్తోంది.

    బరువు బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న నాసా

    సునీత విలియమ్స్ శరీర బరువు 140 పౌండ్లు ఉన్నప్పుడు ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. అయితే ఆమె తన పూర్వ బరువును పొందడానికి ప్రతిరోజు 3500 నుంచి 4 వేల వరకు కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంతరిక్షంలో వ్యోమగాములు తమ కండరాలను, ఎముకలను అత్యంత బలంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు రెండు గంటల కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇక పురుష వ్యోమగాములతో పోల్చితే.. మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో శరీర బరువును వేగంగా కోల్పోతారు. అలాంటప్పుడు వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు ను కోల్పోయిన సునీత విలియమ్స్ విషయంలో నాసా తీవ్రంగా పని చేస్తోంది. ఇప్పటికే ప్లైట్ సర్జనల ద్వారా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. ” స్పేస్ లో ఉన్నప్పుడు వ్యోమగాములు సులభంగా బరువు తగ్గుతారు. జీవక్రియలు మందగిస్తాయి. వాతావరణం లో భార రహిత స్థితి ఉంటుంది కాబట్టి వ్యోమగాములు ఇతర ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇందుకు సునీత మినహాయింపు కాదు. కాకపోతే ఆమె ఆరోగ్యంపై మేము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమ్మీదకు వస్తారు. అప్పటి వరకు ఆమె మా పర్యవేక్షణ లో ఉంటారని” నాసా అధికారులు చెబుతున్నారు.