Shaik Rasheed: ప్రస్తుత ఐపిఎల్ లో చెన్నై జట్టులోకి సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పాత మల్లాయపాలెం గ్రామానికి చెందిన రషీద్. ఇతడి తండ్రి పేరు బాలీషావలీ. ఇతడు హైదరాబాదులో ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.. అండర్ 14 లో రాష్ట్రస్థాయిలో రషీద్ ప్రతిభ చూపించాడు. దీంతో అతడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆడాల్సి వచ్చింది. ఫలితంగా మంగళగిరిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బాలిషావలి ఉద్యోగ మొదలుపెట్టి గుంటూరు వచ్చాడు. తన కుమారుడు రషీద్ ను రోజూ ప్రాక్టీస్ కు తీసుకెళ్లేవాడు. అతడికి ప్రాక్టీస్ లేని రోజు కూలీ పనులకు వెళ్లేవాడు.. ఇక సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు తరుపున ఎంట్రీ ఇవ్వడంతో రషీద్ తండ్రి ఆనందానికి అవధులు లేవు. రషీద్ తండ్రి బాలిషా వలి హైదరాబాదులో పని చేస్తున్నప్పుడు ఆర్థికంగా మెరుగ్గానే ఉండేవాడు.
Also Read: ముంబై, చెన్నై, హైదరాబాద్.. జాతి రత్నాలు.. వీడియో వైరల్
కానీ ఎప్పుడైతే గుంటూరు జిల్లాకు వచ్చాడో.. అప్పటినుంచి అతని ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఇక్కడ ఉద్యోగం లభించలేదు. పెద్దగా ఆస్తిపరుడు కూడా కాదు. హైదరాబాదులో ఉన్నప్పుడు మాత్రం చేతిలో నాలుగు డబ్బులు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో బాలిషా వలి తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ తన కొడుకు కోరికను నెరవేర్చేందుకు తీవ్రంగా కష్టపడేవాడు. తన కష్టం.. తన ఇబ్బంది కుమారుడికి తెలియనిచ్చేవాడు కాదు. తన కొడుకుకు కావలసిన క్రికెట్ సామగ్రి కొనుగోలు చేసేవాడు. అతడికి ఎటువంటి లోటు రానిచ్చేవాడు కాదు. నచ్చిన భోజనం.. నచ్చిన క్రికెట్ సామగ్రి.. సమకూర్చేవాడు. ఇందుకోసం బాలిషావలి ఎన్నో త్యాగాలు చేశాడు. చివరికి ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున సోమవారం ఎంట్రీ ఇవ్వడంతో బాలిషావలి ఆనందానికి అవధులు లేవు. తన కుమారుడు క్రికెట్ ఆడుతుంటే చూసి అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. తన భావోద్వేగాన్ని ఆపుకోలేక క్రికెట్ ఆడుతున్న కుమారుడిని అలానే చూస్తూ ఉండిపోయాడు.
తొలి మ్యాచ్లో అదరగొట్టాడు
రషీద్ సోమవారం జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. లక్నో బౌలర్ల పై ప్రారంభం నుంచే ఎదురు దాడికి దిగాడు. ఏమాత్రం భయపడకుండా దంచి కొట్టాడు.. అతడు దూకుడు వల్ల చెన్నై జట్టు తొలి వికెట్ కు అర్థ శతక భాగస్వామ్యం నమోదుచేసింది. రషీద్ 19 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 27 పరుగులు సాధించాడు.. దూకుడుగా ఆడుతున్న అతడు ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తరచూ విఫలమవుతున్న డేవిడ్ కాన్వే స్థానంలో రషీద్ కు చోటు ఇవ్వడం చెన్నై జట్టుకు సత్ఫలితాన్ని ఇచ్చింది. రషీద్ దూకుడుకు.. రచిన్ రవీంద్ర వేగంతోడు కావడంతో చెన్నై జట్టు స్కోరు అమాంతం పరుగులు పెట్టింది. ఇక తొలి మ్యాచ్లో తన ఏంటో నిరూపించుకున్న రషీద్.. తదుపరి మ్యాచ్లో కూడా చెన్నై ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు రషీద్ పై ధోనికి విపరీతమైన నమ్మకం ఉంది. అందువల్లే అతడికి అవకాశం ఇచ్చాడు. తన ఏంటో నిరూపించుకున్నాడు కాబట్టి.. ఇకపై చెన్నై జట్టులో ఓపెనర్ గా రషీద్ వచ్చే అవకాశం ఉంది. ఎలాగో ధోని అండదండలు ఉన్నాయి కాబట్టి రషీద్ చెలరేగిపోయే అవకాశం ఉంది.
Also Read: కాటేరమ్మ కొడుకంటే ఎవరో క్లాసెన్ కు తెలిసిపోయింది.. వైరల్ వీడియో