Shaheen Afridi Yorker: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి అన్ని దేశాలు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే తమ జట్లను ప్రకటించి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. అక్టోబర్ 23న ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. భారత్ ను గేళి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు. మనల్ని రెచ్చగొట్టాలని భావిస్తున్నారు. దీని కోసమే ఆటగాళ్లు తమ మాటలకు పదును పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రేక్షకుల్లో అసహనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ తో పోరుకు తాము సిద్ధమేనని రెచ్చగొట్టే కామెంట్లు చేయడంతో మన ఆటగాళ్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గాయం కారణంగా ఆసియా కప్ 2022కు షహీన్ షా ఆఫ్రిది ఇంగ్లండ్ తో జరిగిన ఏడు మ్యాచులకు దూరం అయ్యాడు. ఈ సమయంలో శస్త్ర చికిత్స కోసం విరామం తీసుకున్నాడు. దీనికి పీసీబీ సహకారం అందించలేదు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇటీవల లండన్ లో చికిత్స చేయించుకున్న అఫ్రిది ప్రస్తుతం ఫిట్ గా మారాడు. దీంతో పాక్ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గనిస్తాన్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అఫ్రిది చెలరేగిపోయాడు. తొలి ఓవర్లో అఫ్గాన్ డేంజరస్ బ్యాటర్ గుర్జాబ్ రహ్మనుల్లాను ఎల్బీగా అవుట్ చేయడం సంచలనం కలిగించింది.
అఫ్రిది వేసిన బంతితో రహ్మనుల్లా ఎడమ పాదాన్ని బంతి బలంగా తాకడంతో అతడు విలవిలలాడాడు. నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అఫ్రిది భారత్ కు ఓ సవాల్ విసిరినట్లు గా చెబుతున్నాడు. దీంతో మన ఆటగాళ్లు కూడా సరైన సమాధానమే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్రిది, నసీం షా ప్రమాదకరంగా మారనున్నారు. రోహిత్, రాహుల్, కోహ్లిలకు వీరు సవాలు విసిరే సూచనలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో బరిలో దిగాలి. యాకర్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

మరోవైపు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డుగా నిలవనుంది. మ్యాచ్ జరిగే రోజు భారీ వర్షం ఉందని చెబుతున్నారు. గురువారం నుంచి కూడా ఆస్ట్రేలియా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు వర్షం ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లు చేస్తున్న కవ్వింపులపై మనవారు మ్యాచ్ రద్దు చేసుకోవాలనే ప్రతిపాదన తెస్తున్నట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లు భారత్ తో మ్యాచ్ కు తాము సిద్ధంగా ఉన్నామని చేసే ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్ ఆటగాళ్ల తీరుకు మన వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.