Homeఎంటర్టైన్మెంట్Nagarjuna - Sardar Movie: తన గోస్ట్ ఫెయిల్ అయినప్పటికీ కార్తీకి ఊపిరి పోసిన నాగార్జున

Nagarjuna – Sardar Movie: తన గోస్ట్ ఫెయిల్ అయినప్పటికీ కార్తీకి ఊపిరి పోసిన నాగార్జున

Nagarjuna – Sardar Movie:  భారీ అంచనాల మధ్య విడుదలైన నాగార్జున దీ ఘోస్ట్ ప్లాప్ అయింది. ఈ ఏడాది ఆరంభంలో బంగార్రాజు లాంటి క్లీన్ హిట్ అందుకున్న నాగార్జునకు దీ ఘోస్ట్ పంటి కింద రాయిలా తగిలింది. ఈ సమయంలో ఆ బాధ నుంచి తీరుకునేందుకు కార్తీ రూపంలో ఆయనకు ఒక పరిష్కార మార్గం లభించింది. ఇంతకీ అది ఏంటంటే

Nagarjuna - Sardar Movie
agarjuna – Sardar Movie

8 కోట్లు పెట్టి కొన్నాడు

ది ఘోస్ట్ పరాజయం పాలైన తర్వాత నాగార్జున తీవ్ర మదనంలో పడిపోయాడు. సరిగా అదే సమయంలో కార్తీ, రాశిఖన్నా జంటగా సర్దార్ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఊపిరి సినిమా ప్రారంభం నుంచి నాగార్జున, కార్తీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి వీరి బంధం కొనసాగుతోంది. సినిమా బాగుండడంతో కార్తీ సూచనల మేరకు నాగార్జున ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్లకు కొనుగోలు చేశారు. తన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ పేరు మీద ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో విడుదల చేయనున్నారు. అయితే సర్దార్ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడు పోయింది. దీనికంటే ముందు పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడం తో కార్తీ సర్దార్ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తమిళంలో సుమారు 44 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది.

Nagarjuna - Sardar Movie
Sardar Movie

సినిమా విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం రావడంతో… ఇకపై వచ్చేవన్ని లాభాలే అని నిర్మాతలు చెబుతున్నారు. గూడచర్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా లో రాశిఖన్నా కార్తి సరసన నటిస్తోంది. ది ఘోస్ట్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ నష్టం నుంచి తేరుకునేందుకు నాగార్జున సర్దార్ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సినిమా గూడచర్యం నేపథ్యంలో సాగుతుండగా, హీరో కార్తీ భిన్న రూపాల్లో కనిపిస్తున్నాడు. రెండేళ్ల క్రితం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా దీపావళికి ముందే విడుదలై తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కార్తీ తన సినిమాని దీపావళికి ముందే విడుదల చేస్తున్నాడు. ప్రాంతంలో దసరా, సంక్రాంతికి ఎంతటి హడావిడి ఉంటుందో… తమిళనాడులో దీపావళికి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఇదే సమయంలో పోటాపోటీగా సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో దీపావళికి ముందు పెద్ద చిత్రాలు ఏవి విడుదలకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలో ఆ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకు కార్తీ సర్దార్ సినిమాను విడుదల చేస్తున్నాడు. అయితే ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్, ట్రెయిలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా కూడా అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా విజయవంతం అయితే.. ఈ ఏడాదిలో రెండు సీట్లు సాధించిన ఘనత కార్తికే దక్కుతుంది. కాగా కార్తీ ఒక హీరోగా నటించిన పోన్నియన్ సెల్వన్ కమల్ హాసన్ విక్రమ్ ను దాటేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిగతా ప్రాంతాల్లో ఫ్లాఫ్ అయినప్పటికీ.. తమిళనాట మాత్రం విజయదుందుభి మోగిస్తోంది. అయితే సర్దార్ విడుదల అవుతుండడంతో ఆ ప్రభావం పొందిన పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల మీద ఉంటాయని సినీ పండితులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version