Pathan Collections: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఇప్పటి వరకు సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది.
Also Read: Valentine Day Troll: ట్రోల్ ఆఫ్ ది డే: ప్రేమను వ్యక్తపరిస్తే: పదిమందిలోకి పిలిచి పంచాయతీ పెట్టారు
మెగాస్టార్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచి కెరీర్ ఇక అయ్యిపోయిందేమో అని అందరూ అనుకుంటున్న సమయం లో బౌన్స్ బ్యాక్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఇక్క చిరంజీవి లాగానే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కూడా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు.సుమారు దశాబ్ద కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్ ఖాన్ రీసెంట్ గా ‘పఠాన్’ సినిమాతో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్లాస్ట్ చేసాడో అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం ఇప్పటి వరకు 950 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోబోతున్న ఈ చిత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పింది.ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ సినిమా టాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యపడని అరుదైన రికార్డు ని నెలకొల్పింది.అసలు విషయానికి వస్తే హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రం నేషనల్ ముల్టీప్లెక్సుల నుండి 20 రోజులకు గాను 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు హైదరాబాద్ లో రాలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఆ చిత్రానికి ఇక్కడ దాదాపుగా 14 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది.అంటే షారుక్ ఖాన్ కి హైదరాబాద్ లో మన టాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.ఇంకా ఈ చిత్రానికి రన్ ఉండడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా హైదరాబాద్ నుండి 20 కోట్ల రూపాయిల మార్కుకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
Also Read:Rushikonda Green Matt : ట్రోల్ ఆఫ్ ది డే : రుషికొండకు గ్రీన్ మ్యాట్.. ఇంతకంటే సెటైర్ ఉండదేమో