Dil Raju- Harish Shankar: పవన్ కళ్యాణ్ కోసం ఆగిన హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ పవన్ తో చిత్రం ప్రకటించిన హరీష్ ఆయన కాల్ షీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.
Also Read: Pathan Collections: హైదరాబాద్ లో ‘వాల్తేరు వీరయ్య’ ని దాటేసిన షారుక్ ఖాన్ ‘పఠాన్’
హరీష్ శంకర్ నాలుగేళ్ల క్రితం ‘గద్దలకొండ గణేష్’ తీశాడు. అప్పటి నుంచి మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో మూడు సినిమాలు చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు టైం బాగా లేకపోవడంతో మళ్లీ దిల్ రాజు బ్యానర్ వైపు వెళుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం దిల్ రాజు తమిళ దర్శకుడు శంకర్ తో రాంచరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి సినిమా కూడా లైన్లో ఉంది. ఇప్పుడు హరీష్ శంకర్ తోనూ ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట.
అయితే పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేశాకే అటు వెళతాడా? లేక మధ్యలోనే దిల్ రాజు సినిమా పూర్తి చేస్తాడా? అన్నది వేచిచూడాలి. మొత్తంగా ఒక సినిమా అయితే తీయాలన్న తొందరలో హరీష్ శంకర్ ఉన్నారు.