Raja Raghuvanshi Sonam Case: మేఘాలయ హనీమూన్ కేసులో రోజుకో తీరైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల దర్యాప్తులో నిందితురాలు సోనం చెబుతున్న విషయాలు అధికారులకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి . ఇప్పటివరకు ఈ ఘటన విషయంలో వివరాలు యావత్ దేశాన్ని కలవరపరిస్తే.. విచారణలో సోనం చెబుతున్న వివరాలు మరింత విషయాన్ని కలగజేస్తున్నాయి.
రఘువంశీని వివాహం చేసుకున్న తర్వాత సోనం వెంటనే హనీమూన్ వెళ్లాలని అతడి ముందు ప్రతిపాదన ఉంచింది. దానికి అతడు ముందుగా నిరాకరించాడు. అయితే ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారిద్వారా ఆమోదం తీసుకొని తన భర్తతో కలిసి మేఘాలయ వెళ్లిపోయింది సోనం.. ఆ తర్వాత అక్కడ ఏకాంతంగా గడపాలని రఘువంశి ప్రతిపాదన తీసుకొస్తే సోనం తిరస్కరించింది. దీనికి ఒక విచిత్రమైన షరతుని విధించింది. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తిచేసిన తర్వాతే శారీరకంగా కలుద్దాం అంటూ భర్తకు శరత్ విధించింది.. మేఘాలయ వెళ్లిన తర్వాత.. ముందుగానే తన బాయ్ ఫ్రెండ్ ను అక్కడికి పిలిపించుకుంది సోనం. ఆ తర్వాత అతడిని భూమ్మీద లేకుండా చేయడానికి ఒక నేరగాళ్ల బృందంతో అంగీకారం కుదుర్చుకుంది. ఏకంగా 20 లక్షల వరకు ఇస్తానని స్పష్టం చేసింది. దీంతో వారు ఈ దారుణం చేయడానికి ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా రఘువంశీని అర్థం చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. మేఘాలయలో వెళ్లిన తర్వాత.. అక్కడి కామాఖ్య ఆలయం వద్దకు తీసుకెళ్లాలని సోనం భర్తను బలవంత పెట్టింది. అంతకంటే ముందుగానే బాయ్ ఫ్రెండ్, అతడి అనుచరులను అక్కడ ఉండాలని చెప్పింది. భర్తను బలవంత పెట్టడంతో అతడు ఇష్టం లేకున్నా ఆమెను తీసుకెళ్లాడు. అయితే నాంగ్రి యాట్ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో.. సోనం పాచిక పారలేదు. ఆ తర్వాత భర్తను వెయి సావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లింది. ఎత్తైన కొండమీదికి ఎక్కిన తర్వాత.. గట్టిగా చంపేయండి అంటూ అరిచింది.. అక్కడే కాపు కాసినవారు ఒక్కసారిగా అతడిని అంతం చేశారు. రఘు వంశీని అంతం చేస్తుంటే సోనం అక్కడే కూర్చుని వినోదం చూసింది.
ఆ తర్వాత అతని మృతదేహాన్ని రకరకాల ప్రాంతాలు మార్చుతూ ఒక రోడ్డు పక్కన పడేసింది. ఆ తర్వాత తనను కిడ్నాపర్లు అపహరించినట్టు నాటకమాడింది. తన ఫోన్ పగలగొట్టింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా సోనం భాగోతం బయటపడింది. ఆ తర్వాత ఆమెను పోలీసులు ఉత్తర ప్రదేశ్ లోని ఓ దాబాలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ ను కూడా అద్దులకు తీసుకున్నారు. వారిద్దరిని జైలుకు తరలించారు. విచారణలో భాగంగా అధికారులు వారిద్దరిని ప్రశ్నిస్తుంటే.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పోలీసులకు షాక్ తగిలినంత పనవుతోంది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. పోలీసులు ఈ కేసును అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారు.