Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) లాంటి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ‘సందీప్ రెడ్డి వంగ’ (Sandeep Reddye Vanga)… ఈయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా అటెన్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి ఆయన ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయబోతున్నాడు. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసుకొని ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డివంగ ప్రభాస్ కి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారట. ఈ సినిమా షూటింగ్ కి రావడానికి లేట్ అయిన పర్లేదు. కానీ ఒక్కసారి తన సినిమా షూటింగ్ కి వచ్చినట్లయితే ఆ సినిమా మొత్తం పూర్తి అయ్యేంత ఆ సినిమా మీదనే స్టిక్ అయి ఉండాల్సిన అవసరమైతే ఉందట.
ఎందుకంటే ఆ గెటప్ ని కనక చేంజ్ చేస్తే మళ్ళీ అందులో చాలా వేరియేషన్స్ అయితే వస్తాయట…తద్వారా ఆయన ఒక సినిమా మీదే ఉంటే ఒకే గెటప్ లో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చని అందుకే అతని సినిమా షూటింగ్ పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళ సినిమాల షూటింగ్ కి వెళ్ళకూడదు అంటూ కొన్ని కండిషన్స్ అయితే పెట్టాడట.
అలాగే తను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం దాటి వెళ్లిపోకూడదు అంటూ కొన్ని కండిషన్స్ అయితే పెట్టాడట. మరి మొత్తానికైతే ప్రభాస్ ఈ కండిషన్స్ ని అంగీకరించి సందీప్ రెడ్డి వంగ తో ట్రావెల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ ని ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో బోల్డ్ గా చూపించడానికి కూడా సందీప్ రెడ్డి వంగా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రభాస్ అభిమానులు ఆ సీన్స్ ను చూసి ఎలా స్పందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది… ఇండియా మొత్తం ప్రభాస్ జపం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన నుంచి సినిమా వస్తే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళుతోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…