https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ మరింత ఆలస్యం.. జక్కన్న ప్లాన్ ఏంటీ?

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీకి కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: బన్నీబాబు ముందు వైజాగ్ లో ప్రత్యక్షమవుతాడట ఆర్ఆర్ఆర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 06:46 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో వస్తున్న ఈ మూవీకి కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: బన్నీబాబు ముందు వైజాగ్ లో ప్రత్యక్షమవుతాడట

    ఆర్ఆర్ఆర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సంచలనం సృష్టించాయి. అదిరిపోయే రెస్పాన్స్ తో ట్రెండింగులోకి దూసుకెళుతున్నాయి.

    ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజు డేట్ పలుసార్లు వాయిదా పడింది. 2021 సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. దీంతో ఈ మూవీని వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను రాజమౌళి ట్వీటర్లో పోస్టు చేసిన సంగతి తెల్సిందే.

    దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతోనే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చరణ్.. ఎన్టీఆర్.. మిగతా సిబ్బంది కరోనా బారినపడకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళికి కొత్త ప్రణాళికను సిద్ధంచేయగా హీరోలిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    ఇటీవలే రాజమౌళి హైదరాబాద్లో 15రోజుల షూటింగ్ ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా ప్రతీ మూడురోజుల తర్వాత ఒకరోజు బ్రేక్ తీసుకొని షూటింగ్ చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ యూనిట్ కోవిడ్ బారినపడకుండా ఉండేందుకే ఇలా గ్యాప్ తీసుకుంటున్నారట. రాజమౌళి ప్లాన్ ని ఎన్టీఆర్.. చరణ్ యథావిధిగా ఫాలో అవుతున్నారు.

    Also Read: ఇటలీ వెళ్లినా ప్రభాస్‌కు కష్టాలు తప్పట్లేదు

    ఇలా షూటింగ్ చేస్తే వచ్చే వేసవికైనా సినిమా రిలీజ్ అవుతుందా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించి గత్యంతరం లేదని పలువురు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.