https://oktelugu.com/

మహేష్ ‘సర్కారీ వారి పాట’ అప్పుడే మొదలుకానుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీలో మహేష్ బాబుకు సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించనుంది. ఇటీవలే కీర్తి సురేష్ జన్మదినం సందర్భంగా చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈమేరకు మహేష్ బాబు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ‘సర్కారువారిపాట’లోకి ఆహ్వానించాడు. Also Read: బన్నీబాబు ముందు వైజాగ్ లో ప్రత్యక్షమవుతాడట సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ మూవీ ప్రారంభమైంది. కరోనా ఇంకా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 06:52 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. ఈ మూవీలో మహేష్ బాబుకు సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించనుంది. ఇటీవలే కీర్తి సురేష్ జన్మదినం సందర్భంగా చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈమేరకు మహేష్ బాబు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ‘సర్కారువారిపాట’లోకి ఆహ్వానించాడు.

    Also Read: బన్నీబాబు ముందు వైజాగ్ లో ప్రత్యక్షమవుతాడట

    సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ మూవీ ప్రారంభమైంది. కరోనా ఇంకా తగ్గముఖం పట్టకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమా కథ రీత్య షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుందట. దీంతో దర్శకుడు పర్శురాం గతంలోనే అమెరికాలోని కొన్ని లోకేషన్లను ఎంపిక చేశాడు.

    ‘సర్కారువారిపాట’ యూనిట్ లోని సిబ్బందికి వీసాలో సమస్యలు రావడంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్ విన్పిస్తోంది. దీంతో మహేష్ ఈ చిత్రం కోసం ఇటీవల ఇచ్చిన 45రోజుల కాల్షీట్స్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్ అమెరికాలో కాకుండా ఇండియాలో చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

    మహేష్ లేకుండా ఈ మూవీ షూటింగును నవంబర్లో ప్రారంభించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. అయితే తాజాగా ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లోనూ పలువురు కరోనా బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగు జనవరిలో ప్రారంభం కానుందట.

    Also Read: ఇటలీ వెళ్లినా ప్రభాస్‌కు కష్టాలు తప్పట్లేదు

    దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్.. 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్ నిజమవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!