
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు రిలయెన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 168 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది. అయితే లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులని కంపెనీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.
https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా మహిళలు ఈ ఉద్యోగానికి ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేయాల్సిన లింక్ ను ఓపెన్ చేసి సరైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు మహిళలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మొదటి ఆరు నెలలు 10,000 రూపాయలు, తరువాత ఆరు నెలలు 12,500 రూపాయలు వేతనం చెల్లిస్తారు.
ఈ నెల 28వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరిరోజు. డిగ్రీ పూర్తైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. స్మార్ట్ ఫోన్ తో పాటు వెహికిల్ ఉన్నవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీలను పరిశీలిస్తే గుంటూరులో 20, విజయవాడలో 10, నరసరావుపేటలో 5, తెనాలిలో 5, సత్తెనపల్లిలో 10, గుడివాడలో 10, మచిలీపట్నంలో 10 ఖాళీలు ఉన్నాయి.
రాజమండ్రిలో 20, వైజాగ్ లో 15, తణుకులో 10, విజయనగరంలో 10, హిందూపూర్ లో 15, కడపలో 5, అనంతపురంలో 10, ధర్మవరంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.